BigTV English
Advertisement

Moonlighting : మూన్‌లైటింగ్‌పై కంపెనీలు దిగొస్తున్నాయా?

Moonlighting : మూన్‌లైటింగ్‌పై కంపెనీలు దిగొస్తున్నాయా?

Moonlighting : ఐటీ కంపెనీల్లో ఇటీవల తీవ్ర దుమారం రేపిన అంశం… మూన్ లైటింగ్. ఒక కంపెనీలో పనిచేసే టెక్కీ… యాజమాన్యానికి తెలీకుండా మరో సంస్థలోనూ ఇంటి నుంచి పనిచేస్తున్నారని బయటపడటంతో… దిగ్గజ కంపెనీలన్నీ ఉలిక్కిపడ్డాయి. మూన్ లైటింగ్ ను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ… ఉద్యోగుల తొలగింపును కూడా చేపట్టాయి. కానీ… దీనికి పూర్తి భిన్నంగా టెక్ మహీంద్రా చేసిన ప్రకటన… మూన్ లైటింగ్ సమస్యకు ఓ పరిష్కారం కనిపెట్టే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయా? అనే చర్చకు దారితీసింది.


సంస్థ ఉద్యోగులు అదనపు పనులు చేసుకునేందుకు తమకు అభ్యంతరమేమీ లేదని టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ అన్నారు. ఖాళీ సమయాల్లో ఎంప్లాయిస్ ఇతర పనులు చేసుకునేందుకు అనుమతించేలా… మూన్‌లైటింగ్‌ విధానాన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే, ఇందుకు కొన్ని షరతులు ఉండొచ్చని గుర్నానీ సంకేతాలిచ్చారు. కంపెనీ నిబంధనల్ని అనుసరిస్తూ… ఇతర ఉద్యోగాలు చేసుకోవడంలో తమకు అభ్యంతరమేమీ లేదంటున్నారాయన.

ప్రస్తుతం టెక్ మహీంద్రా 90 దేశాల్లో… ఆయా దేశాల కార్మిక చట్టాల్ని అనుసరించి కార్యకలాపాలు కొనసాగిస్తోందని గుర్నానీ చెప్పారు. తమ ఉద్యోగులకు రెండో సంపాదన ఉంటే తామూ సంతోషిస్తామని… అయితే, కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏం చేస్తున్నారనేది కంపెనీకి చెప్పి అనుమతి తీసుకుంటే సరిపోతుందన్నారు. అలా కాకుండా చేసే పని దాచిపెడితే… చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గుర్నానీ ప్రకటన ఇతర ఐటీ కంపెనీలను ఆశ్చర్యపరిస్తే… టెక్కీల్ని మాత్రం సంతోషంలో ముంచింది. ఓ కంపెనీలో పని చేస్తూ… ఖాళీ సమయంలో మరో సంస్థలో ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తే… అంతకన్నా కావాల్సిందేముందనేది టెక్కీల అభిప్రాయం.


Tags

Related News

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Big Stories

×