Sukumar Daughter: సినీ పరిశ్రమలో ఏ విభాగంలో పనిచేసే వారు అయినా తమ వారసులను హీరో, హీరోయిన్లుగానే చూడాలని అనుకుంటారు. కానీ చాలావరకు హీరోల వారసులు మాత్రమే తగినంత పాపులారిటీ సంపాదించుకుంటారు. ఇప్పటివరకు ఎంతోమంది డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, నిర్మాతల వారసులు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా అందులో సక్సెస్ సాధించినవారు మాత్రం చాలా తక్కువే. ఇక ఈ వారసుల్లో కొందరు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. ఆ కేటగిరిలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె కూడా యాడ్ అవ్వనుంది. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి (Sukriti Veni Bandreddi) లీడ్ రోల్ చేసిన ‘గాంధీ తాత చెట్టు’ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.
చైల్డ్ ఆర్టిస్ట్
టాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుకుమార్ (Sukumar) పాపులారిటీ ఎంతగా పెరిగిపోయిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సుకుమార్.. తన వారసురాలిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాడంటే తనను వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు చాలా ఎగ్జైట్ అయ్యారు. ప్రస్తుతం సుకుమార్ కుమార్తె ఇంకా స్కూల్‌లో చదువుతోంది. అయినా అప్పుడే ఆర్టిస్ట్‌గా మారి ఒక అవార్డ్ విన్నింగ్ సినిమాలో నటించింది. అదే ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu). ఇప్పటికే ఈ మూవీ ఎంతోమంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమాలో తన నటనకు సుకృతికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కింది.
Also Read: సంధ్య థియేటర్ కేసులో ‘పుష్ప 2’ నిర్మాతలకు ఊరట.. వారికి అనుగుణంగా కోర్టు తీర్పు
విడుదల తేదీ ఎప్పుడంటే
‘గాంధీ తాత చెట్టు’ను పద్మావతి మల్లాడి డైరెక్ట్ చేయగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ కలిసి సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమా స్క్రీనింగ్ జరిగింది. ఇప్పుడు ఇదే మూవీ వెండితెరపై వెలగడానికి సిద్ధమయ్యింది. జనవరి 24న ‘గాంధీ తాత చెట్టు’ థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవి శంకర్, సేషా సింధూ రావు ఈ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. సుకుమార్ భార్య తబితా సుకుమార్.. ఈమూవీని ప్రజెంట్ చేస్తున్నారు. రీ.. మ్యూజిక్ అందించాడు. మొత్తానికి సుకుమార్ వారసురాలిని వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు.
కనెక్ట్ అవుతుంది
గాంధీ నినాదం అయిన అహింసను ‘గాంధీ తాత చెట్టు’లో చక్కగా చూపించామని మేకర్స్ చెప్తున్నారు. ఇందులో కథను చాలా అందంగా చెప్పామని, పాజిటివిటీని, శాంతిని పంచడం ఎంత ముఖ్యమో వివరించామని అంటున్నారు. కచ్చితంగా ఇది అందరు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇప్పటికే ‘గాంధీ తాత చెట్టు’కు పలు అవార్డులు దక్కాయి. 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ పిక్చర్ అవార్డ్, న్యూ ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ రీజియనల్ ఫిల్మ్ అవార్డ్, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ దక్కించుకుంది ఈ సినిమా. దీంతో జనవరి 24న విడుదలయ్యే ‘గాంధీ తాత చెట్టు’పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.