January Upcoming Movies : కొత్త ఏడాది కొంగొత్త ఆశలతో పలువురు మేకర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జనవరిలో రాంచరణ్ నుంచి సోనూ సూద్ దాకా పలువురు స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రమోషన్లు జోరుగా నడుస్తున్నాయి. అయితే సంక్రాంతికి మాత్రమే కాకుండా జనవరి మొత్తంలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటి? అవి థియేటర్లలోకి ఎప్పుడు రాబోతున్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐడెంటిటీ (Identity)
జనవరి 1న ‘మార్కో’ అనే డబ్బింగ్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో అదరగొడుతుండగానే, తాజాగా మరో మలయాళ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు టోవినో థామస్, చెన్నై చిన్నది త్రిష ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 2న థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ కేవలం మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది.
గేమ్ ఛేంజర్ (Game Changer)
సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో భారీ అంచనాలు నెలకొన్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 10న థియేటర్లలోకి రాబోతోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడంతో హైప్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
డాకు మహారాజ్ (Daaku Maharaaj)
‘గేమ్ ఛేంజర్’ థియేటర్లలో అడుగు పెట్టిన రెండు రోజుల్లోనే బాలయ్య ‘డాకు మహారాజ్’ మూవీతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతున్నారు. బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘డాకు మహారాజ్’ జనవరి 12 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam)
సంక్రాంతి రేసులో ఉన్న మరో స్టార్ హీరో మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ తోనే పండగ వైబ్ తీసుకొచ్చింది. ముచ్చటగా మూడోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతోంది.
ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా హిందీలో కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) మూవీ జనవరి 17న రిలీజ్ కాబోతోంది. అలాగే సోనుసూద్ హీరోగా నటించిన ‘ఫతేహ్’ (Fateh) మూవీ కూడా జనవరి 10న థియేటర్లలో కి రానుంది. అయితే అన్నీ భాషల ప్రేక్షకుల దృష్టి మాత్రం ‘గేమ్ ఛేంజర్’పైనే ఉంది.