TS High court: దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో పోలీసులకు హైకోర్టులో ఊరట లభించింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఇవ్వగా..దీనిపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
దేశ వ్యాప్తంగా దిశ అత్యాచారం ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే అయితే.. ఈ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అంశం కూడా తీవ్ర దుమారం రేపింది. ఎన్ కౌంటర్ పై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ను నియమించింది. కాగా కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ నివేదికపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం షాద్ నగర్ తహశీల్దారు, పోలీసులపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
Also Read:ఓయూ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వేసవి సెలవుల్లోను హాస్టల్ ఓపెన్
సుప్రీం కోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్..క్షేత్ర స్థాయిలో పర్యటించి పలువురిని విచారించింది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై హత్యానేరం క్రింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొనగా..నివేదిక సరిగ్గా లేదని పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పు వెలువరించింది.