BigTV English

Suma: 30 మంది విద్యార్థుల‌కు సుమ స‌పోర్ట్‌.. నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు

Suma: 30 మంది విద్యార్థుల‌కు సుమ స‌పోర్ట్‌.. నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు

Suma:బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు, సినీ అభిమానుల‌కు సుమ గురించిన పరిచ‌యం అక్క‌ర్లేదు. బుల్లి తెర‌పై స్టార్ మ‌హిళ‌, క్యాష్ వంటి ప్రోగ్రామ్స్‌తో పాటు టాలీవుడ్‌లో ప‌లు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు ఆమె యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. చాలా గ్యాప్ త‌ర్వాత ఆమె ఈ మ‌ధ్య జ‌య‌మ్మ పంచాయితీ అనే సినిమాలోనూ న‌టించింది. తాజాగా ఈ స్టార్ యాంక‌ర్ చేసిన ప‌నికి అంద‌రూ ఫిదా అయ్యారు. ఆమె మంచి మ‌న‌సును అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంత‌కీ సుమ ఏం చేసిందో తెలుసా!.. 30 మంది విద్యార్థులను ద‌త్తత తీసుకుంది. వారి లైఫ్‌లో సెటిల్ అయ్యే వర‌కు వారికి అండ‌గా ఉంటాన‌ని తెలియ‌జెప్పింది.


ఇటీవ‌ల మ‌ద్రాస్ ఐఐటీలో ఓ ప్రోగ్రామ్‌కి సుమ క‌న‌కాల వెళ్లింది. అక్క‌డ స్టూడెంట్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెబుతూ ‘‘15 ఏళ్ల‌కే యాంక‌ర్‌గా మారాను. బి.కామ్‌, ఎం.కామ్ చ‌దివిన నేను అకౌంటెంట్ అవుదామిన అనుకున్నా, త‌ర్వాత టీచ‌ర్‌గా మారుదామ‌నుకున్నా, కానీ ఇప్పుడు యాంక‌ర్‌గా మారాను’’ అని అన్నారు. తనకు ఇంత చేసిన స‌మాజానికి ఏదైనా చేయాల‌నే ఉద్దేశంతో 30 మంది పేద విద్యార్థుల‌ను ద‌త్త‌త తీసుకున్నాన‌ని ఆమె తెలిపారు. స‌ద‌రు విద్యార్థులు జీవితంలో సెటిల్ అయ్యే వ‌ర‌కు తామే సాయంగా నిలుస్తామ‌ని సుమ పేర్కొన్నారు. సుమ చేసిన ఈ మంచి ప‌నిలో కొంద‌రు ఎన్‌జీఓలు సైతం భాగ‌స్వామ్యులుగా ఉన్న‌ట్లు తెలిపారామె. సుమ చేసిన మంచి ప‌నిని ఇప్పుడు అంద‌రూ అప్రిష‌యేట్ చేస్తున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×