Ajith Kumar..కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఎట్టకేలకు రేర్ ఫీట్ అందుకున్నారు. అయితే ఈ ఘనత సాధించడం కోసం ఏకంగా రెండుసార్లు కారు ప్రమాదానికి కూడా గురయ్యారు. మరి అసలు అజిత్ కుమార్ సాధించిన ఆ రేర్ ఫీట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెల్జియంలోని P2 పోడియంలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మక స్పా ఫ్రాంకోర్‌చాంప్స్ సర్క్యూట్‌లో గెలిచి రికార్డు సృష్టించారు. ఈ గెలుపుకు శుభాకాంక్షలు చెబుతూ.. అజిత్‌కుమార్ తో పాటూ అతని బృందానికి మైత్రి మూవీ మేకర్స్ అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. “ఇది అద్భుతమైన ఫీట్. మేము మీ పట్ల గర్విస్తున్నాము సార్”. అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
పలుమార్లు ప్రమాదానికి గురైన అజిత్ కార్..
స్టార్ హీరో అజిత్ కి కారు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రేసింగ్ లో కూడా పాల్గొంటూ తన అభిరుచిని చాటుకుంటున్నాడు. అయితే ఈ అభిరుచి కారణంగా వరుసగా ప్రమాదాలకు గురవుతున్న విషయం తెలిసిందే. రేసింగ్ లో ఆయన కారు పలుమార్లు ప్రమాదానికి గురైంది. ఇక మొన్న కూడా మరొకసారి అజిత్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ కి గాయాలు కాలేదని ఆయన టీం వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ అజిత్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం మాత్రం నుజ్జు నుజ్జు అయిందట. ఇక 2025 ఫిబ్రవరి 23న స్పెయిన్ లో జరిగిన ఒక రేసింగ్ ఈవెంట్ లో కూడా అజిత్ కారు ప్రమాదానికి గురైంది. మరో కార్ ను తప్పించే క్రమంలో ఆయన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఇకపోతే ఈ ప్రమాదం నుంచి కూడా సురక్షితంగా బయటపడ్డారు.
గుడ్ బ్యాడ్ అగ్లీతో భారీ విజయం..
ఇకపోతే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని అజిత్ రేసింగ్ టీం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఆయన క్షేమంగా ఉన్నారని ప్రమాదానికి ఇతర కార్లే అని సమాచారం.. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకొని 11 రోజుల్లోనే భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.. ఇక ఇందులో త్రిష హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇంకా ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించగా.. విజయ్ వేల్ కుట్టి ఎడిటర్ గా పనిచేశారు. ఇక అలాగే అర్జున్, సిమ్రాన్ తో పాటు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏదేమైనా అజిత్ ఇలా ఒకవైపు తన సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు తన కోరికలను నెరవేర్చుకుంటూ భారీ విజయాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read:Tamannaah: లక్కీ ఛాన్స్ కొట్టేసిన తమన్నా..’వేద’ జోడీ రిపీట్..!
#AK celebrates in the middle of the Indian crowds which loves him with no Bounds. Makes the nation proud 🎉 takes 2nd in the podium…
#AjithKumar #AjithKumarRacing #AKRacing #ThalaOnTrack #GT4Europe #SpaFrancorchamps #PodiumFinish #P2 #BIGTVcinema @Akracingoffl pic.twitter.com/YBa1JCTTIQ
— BIG TV Cinema (@BigtvCinema) April 21, 2025