BigTV English

Nani : నేను ఆయనకు కాంపిటేషన్ కాదు, మీకు టైం ఉంటే నా సినిమా చూడండి

Nani : నేను ఆయనకు కాంపిటేషన్ కాదు, మీకు టైం ఉంటే నా సినిమా చూడండి

Nani : తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పవాళ్లు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాంతం భాషతో సంబంధం లేకుండా సినిమాను ఎంకరేజ్ చేయడంలో తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ ముందుంటారు. అందుకే హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా మన సినిమాలు కంటే పక్కవారి సినిమాలంటేనే మనకు ఇంట్రెస్ట్ ఎక్కువ కదా అని మాట్లాడుతూ ఉంటారు. చాలా సినిమాలకు ఇక్కడ తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. చాలా తమిళ సినిమాలను కూడా తెలుగులో విపరీతంగా ఆదరించారు. అందుకే చాలామంది తమిళ హీరోలకు ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక్కడ కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అలా తెలుగు హీరోలకు అక్కడ అభిమానులు ఉంటారు అనేది గట్టిగా చెప్పలేం. ప్రస్తుతం తెలుగులో వచ్చే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతున్నాయి. ఇక నాని నటిస్తున్న హిట్ 3 సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతుంది.


కాంపిటేషన్ కాదు

నాని హిట్ 3 సినిమా మే 1న రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అలానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ కూడా ఇంప్రెస్సివ్ గా అనిపించాయి. నాని ఒక యాక్షన్ ఫిలిం చేస్తే చూడాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లందరికీ ఈ సినిమా ఒక కంప్లీట్ మీల్ అని చెప్పాలి. శైలేష్ కొలను ఈ సినిమాను చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. తాను ఇంతకు ముందు తీసిన సైంధవ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. అందుకే ఈ సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలనే కసితో పని చేశాడు. ఇకపోతే బాలీవుడ్లో అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2 సినిమా మే 1న విడుదల కానుంది. అయితే ఒక బాలీవుడ్ మీడియా మీరు అజయ్ దేవగన్ కి కాంపిటేషన్ అని నానిని అడిగారు. దానికి నాని సమాధానంగా నేను కాంపిటేషన్ కాదు నాకు తెలుసు ముందు మీరు ఆ సినిమాకే ప్రిఫరెన్స్ ఇస్తారు అని. ఆ సినిమా చూసిన తర్వాత మీకు టైం ఉంటే నా సినిమా చూడండి అంటూ నాని సమాధానం ఇచ్చాడు.


ఇంటెలిజెంట్ నాని

కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలపై నాని మాట్లాడిన తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక తరుణంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సినిమా టికెట్ విషయంలో కూడా ఎవరు మాట్లాడిన తరుణంలో నాని ముందుగా మాట్లాడాడు. దానివలన నాని సినిమాకి ఇంపాక్ట్ కూడా పడింది. ఇక ఇప్పుడు కూడా నాని తన సినిమా ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా కూడా అందర్నీ ఆశ్చర్యపరిచేలా మాట్లాడుతున్నాడు. నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత మేలు నాని నటిస్తున్న పారడైజ్ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

Also Read : Ram Nithin : పది రోజులు తాగాం, మందు ఇంత బాగుంటుందా అనిపించింది

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×