Indian Holidays China| ఇండియా కంటే చైనా చాలా అభివృద్ధి చెందిన దేశమని అందరికీ తెలుసు. దశాబ్దాలుగా భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంది. ఈ విషయాన్ని తాజాగా ఓ భారత సీఈఓ ఎత్తిచూపారు. ఆయన భారతదేశంలో మరీ ఎక్కువగా సెలవు దినాలు ఉన్నాయని ఆయన అభిప్రయాపడ్డారు. ఈ విధానానని తప్పుబడుతూ దీని వల్ల చాలా ఆర్థిక నష్టం జరుగుతోందని చెప్పారు. ఆయన లింక్డ్ ఇన్ లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ పై నెటినెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. భారత కంపెనీ అయిన క్లీన్ రూమ్స్ కంటెయిన్ మెంట్స్ సీఈఓ రవికుమార్ తుమ్మలచర్ల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లింక్‌డ్ ఇన్ చేసిన పోస్ట్ లో ఇండియన్ హాలిడే క్యాలెండర్ ని స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. అందులో కేవలంల ఏప్రిల్ 2025 నెలలో ఎన్ని సెలవు దినాలున్నాయో చూపిస్తూ విమర్శలు చేశారు. ఈ సెలవు విధానం చాలా తప్పు అని ఆయన విమర్శిస్తూ ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలను ట్యాగ్ చేశారు. ఇన్ని రోజుల్లో సెలవులు ఉంటే దాని వల్ల బిజినెస్ పై ప్రతికూల ప్రభావం ఉంటుంది. తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“ఇన్ని సెలవు దినాలా! పని అసలు జరగడం లేదు. భారతదేశంలోని సంస్కృతి, మతపరమైన విలువలకు మేము గౌరవిస్తున్నాం. కానీ పబ్లిక్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్ తో పాటు వీకెండ్ కలిసి వస్తే… ఒక్కసారిగా పనంతా ఆగిపోతుంది. ఒక్క ఏప్రిల్ నెలలలోనే పదికి పై గా సెలవు దినాలున్నాయి. చాలా ఆఫీసుల్లో (ప్రభుత్వ) ఒక ఫైల్ ముందుకు కెళ్లాలంటే వారాల సమయం పడుతోంది” అని ఆయన లింక్డ్ ఇన్ పోస్ట్ లో రాశారు.
దేశంలో ఇటు భారతీయ, అటు పాశ్చాత్య సంస్కృతి రెండూ ఉన్నాయని.. ఈ రెండింటినీ సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పులేదు కానీ అందుకోసం ఆర్థిక అభివృద్ధిని త్యాగం చేయకూడదని సీఈఓ రవికుమార్ అన్నారు. “భారతీయ, పాశ్చాత్య సంస్కృతులను సెలబ్రేట్ చేసుకోవాలని కానీ అందుకోసం ఉత్తపత్తి తగ్గిపోతోంది. అలా జరగకూడదు. దీని వల్ల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, కీలక రంగాలు, అంతర్జాతీయ గుర్తంపుపై తీవ్ర ప్రభావం ఉంటుంది” అని అభిప్రాయపడ్డారు.
Also Read: ప్రియురాలితో భర్త ఉండగా వీడియో రికార్డ్ చేసిన భార్య.. ఆగ్రహించిన కోర్టు
ఆ తరువాత భారత పొరుగు దేశం చైనాతో పోలుస్తూ.. ఇండియా కంటే చైనా 60 ఏళ్ల అడ్వాన్స్ గా ఉందందని, దానికి కారణం వారు ఆర్థిక ప్రగతికి ప్రాముఖ్యం ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయులు కూడా మంచి భవిష్యత్తు, అభివృద్ధి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారని ఎత్తి చూపారు. అందుకే ఇండియన్ హాలిడే కల్చర్ పై (ఇండియా హాలిడే కల్చర్) మరోసారి పునరాలోచించుకోవాలని.. పని, సెలవు దినాల మధ్య బ్యాలెన్స్ ఉండాలని ప్రభుత్వ విభాగాలకు సూచించారు.
అయితే తుమ్మచర్ల చేసిన పోస్ట్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ కావడంతో చాలా మంది నెజిజెన్లు తమ కామెంట్లు పెట్టారు. కొందరు ఆయన ఆలోచనా విధానంతో ఏకీభవిస్తే.. మరి కొందరు ఆయన వాదనను తప్పుబట్టారు. ఆయన కేవలం ఒకవైపు మాత్రమే చూస్తూ అభిప్రాయం వ్యక్తం చేశాడని అంటున్నారు. ఆఫీసులో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం మానసిక ఆరోగ్యం, కుటుంబం పని మధ్య సమతుల్యత కోసం సెలవులు చాలా అవసరమని చెబుతన్నారు.
ఇంకొకరైతే చైనా లాగా భారతీయులు కష్టపడి పని చేయలేరంటూ రాశాడు. అందులో ఒక నెటిజెన్ అయితే .. హాలిడేలు సమస్య కాదు.. సిస్టం సరిగా లేదని రాశాడు. ఇండియాలో ఫెస్టివల్ కల్చర్ ఉంది, అలాగే కమ్యూనిటీ, లోకల్ ఎకానమీ అన్నీ ఉన్నాయి. పని విధానాల్లో తప్పు ఉందని వాటిని సరి చేయాలని కామెంట్ చేశాడు.