Mazaka Movie Trailer Review : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో సినిమా అంటే కేవలం వినోదం అనే నమ్మే దర్శకుడు త్రినాధరావు నక్కిన ఒకరు. సినిమా చూపిస్తా మామ, మేం వయసుకు వచ్చాం, నేను లోకల్, ధమాకా వంటి సినిమాలతో తనకంటూ దర్శకుడుగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు త్రినాధరావు. త్రినాధరావు సినిమాలకి మంచి సక్సెస్ రేట్ ఉంది అని చెప్పాలి. మామూలుగా కొందరు దర్శకులు తీసిన సినిమాలు డిజాస్టర్లు కూడా అవుతుంటాయి. అలా ఒక డిజాస్టర్ కూడా లేకుండా కనీసం యావరేజ్ సినిమా అయినా తీస్తాడు త్రినాధ రావు. ఇకపోతే ఒక దర్శకుడికి బీభత్సమైన గుర్తింపు తీసుకొచ్చే సినిమాలను కొన్ని ఉంటాయి. అలా త్రినాధ రావు విషయానికి వస్తే ధమాకా సినిమా మంచి లాభాలను తీసుకొచ్చి 100 కోట్లు కలెక్షన్స్ తీసుకొచ్చింది.
బెజవాడ ప్రసన్న కుమార్ త్రినాధరావు మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి సందీప్ కిషన్ హీరోగా మజాకా అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పోస్టర్ రిలీజ్ చేసి సంక్రాంతికి సీట్లు లెగుస్తాయి తమ్ముళ్లు అంటూ అనౌన్స్ చేశారు. ఇక ఈ దర్శకుడు ధమాకా సినిమా రిలీజ్ కంటే ముందు తమ్ముళ్లు నేను ఆల్రెడీ ఒక బస్తాడు పేపర్లు చెప్పి ఉంచా అని ఆ సినిమా విషయంలో చెప్పారు. అప్పుడు ఆ వీడియో చాలా వైరల్ గా మారింది. చాలామంది ఏమైనా చెప్పాలనుకున్న కూడా తమ్ముళ్లు అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు అప్పట్లో.
ఈ సినిమా గురించి రిలీజ్ చేసిన పోస్టర్ విషయానికి వస్తే. వైట్ పంచెతో అలానే వైట్ షర్ట్ ధరించి ఒక పాత టేప్ రికార్డర్ తో పోస్టర్లో దర్శనం ఇచ్చాడు సందీప్ కిషన్. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదల చేస్తారు అని అందరూ ఊహించరు. అని కొన్ని కారణాల వలన ఈ సినిమా సంక్రాంతికి రాలేదు. ఒక మహాశివరాత్రి కానుక ఫిబ్రవరి 26న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడిన తరుణంలో ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా, వినోదభరితంగా ఉంది అని చెప్పాలి. మొదటినుంచి మంచి జోక్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి అని అర్థమవుతుంది.
రావు రమేష్ సందీప్ కిషన్ తండ్రిగా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. రావు రమేష్ పెద్ద ఏజ్ లో కూడా లవ్ లో పడటం ఈ సినిమాలో మనం చూడొచ్చు. దీని నుంచి ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినట్టు ఉంది చిత్ర యూనిట్. ఏదో ట్విస్ట్ కూడా ఒకటి పెట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. త్రినాధ్ కుమార్ నక్కిన సినిమాలంటేనే ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ లా ఉంటాయి. ఇక ఈ సినిమా కూడా అదే పంథాలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ కూడా బాగా వినిపించింది. ఒక సాంగ్ ని లైవ్ షూటింగ్ కూడా చేశారు.