Hair Fall Control: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జుట్టు రాలడం, చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కాఫీ పౌడర్ వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాఫీ హెయిర్ మాస్క్ మీ అన్ని సమస్యలకు గొప్ప, సహజమైన పరిష్కారం కావచ్చు. కాఫీ చర్మానికి మాత్రమే కాకుండా, జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాఫీ పౌడర్ తో తయారు చేసిన హెయిర్ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు, దానిని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది:
కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు మూలాలకు ఎక్కువ పోషణను అందిస్తుంది. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది.
చుండ్రు సమస్య నుండి ఉపశమనం:
కాఫీ పౌడర్‌లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి తలపై చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది జుట్టు మూలాలను శుభ్ర పరుస్తుంది. అంతే కాకుండా తలపై కలిగే దురదను కూడా తగ్గిస్తుంది.
జుట్టు మెరుపును పెంచుతుంది:
కాఫీ జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టును మృదువుగా చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. తరచుగా కాఫీ పౌడర్ తో తయారు చేసిన మాస్క్ జుట్టుకు వాడటం వల్ల జుట్టు షైనీగా ఉంటుంది. అంతే కాకుండా నల్లగా కూడా మారుతుంది.
జుట్టుకు పోషణ:
కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టును పోషించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది జుట్టును అంతర్గతంగా బలపరుస్తుంది. ఫలితంగా మూలాల నుండి జుట్టు రాలే సమస్యను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. జుట్టు చివర్లు చిట్లే సమస్యను కూడా నివారిస్తుంది.
కాఫీ పౌడర్‌తో హెయిర్ మాస్క్:
కావాల్సినవి:
కాఫీ పౌడర్- 2-3 టీస్పూన్ల
పెరుగు- 1-2 టీస్పూన్ల
తేనె- 1 టీస్పూన్
కొబ్బరి నూనె-1 టీస్పూన్
తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో పైన తెలిపిన మోతాదులో కాఫీ పొడి వేయండి. దానికి పెరుగు, తేనె, కొబ్బరి నూనె వేసి కలపండి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపండి. తద్వారా మందపాటి పేస్ట్ ఏర్పడుతుంది. ఈ మిశ్రమం ఇప్పుడు మీ జుట్టుకు అప్లై చేయడానికి సిద్ధంగా ఉంది.
Also Read: సమ్మర్‌లో తప్పకుండా పాటించాల్సిన స్కిన్ కేర్
కాఫీ హెయిర్ మాస్క్ ఎలా అప్లై చేయాలి ?
మీ జుట్టును కొద్దిగా తడపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ తలపై, జుట్టుకు బాగా అప్లై చేయండి. జుట్టు మూలాల నుండి తల చివర వరకు అప్లై చేయండి. ఇప్పుడు దానిని జుట్టు మీద 20-30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత గోరువెచ్చని నీటితో జుట్టును వాష్ చేయండి. ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు. ఈ హెయిర్ మాస్క్ 2-3 సార్లు వాడినా జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గుతుంది.