15 Years For Sundeep Kishan: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ నటులలో సందీప్ కిషన్ ఒకరు. ప్రస్థానం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్. ఆ తర్వాత కొన్ని కొన్ని పాత్రల్లో కనిపిస్తూ తానే హీరోగా సినిమా చేయడం మొదలుపెట్టాడు. సందీప్ కిషన్ కెరియర్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా కూడా సందీప్ ఆ సినిమాలు కోసం కష్టపడిన విధానం చాలామందికి విపరీతంగా నచ్చింది. అయితే మంచి సినిమాలు చేయడం మాత్రమే కాకుండా అద్భుతమైన దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత సందీప్ కిషన్ కి ఉంది. ఇక నేటితో ప్రస్థానం సినిమా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో, సందీప్ కిషన్ జర్నీ కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు అయింది. ఈ తరుణంలో సందీప్ కిషన్ ఒక ఎమోషనల్ నోటును రాసుకుంటూ వచ్చాడు.
ఎమోషనల్ లవ్ లెటర్
నా స్నేహితులందరికీ, శ్రేయోభిలాషులకు మరియు అభిమానులందరికీ ఒక ప్రేమలేఖ ♥️
వావ్, 15 సంవత్సరాలు త్వరగా గడిచిపోయాయి. అలానే అది ఎంత సాహసం, ఇప్పటికీ లోపల ఆ పిల్లవాడిలాగే అనిపిస్తుంది కానీ ఇప్పుడు తన బాధ్యతలను తెలిసిన పిల్లవాడిని. స్కూల్‌లో నన్ను సందీప్.. పదం సందీప్.. శాండీ.. అని పిలిచేవారు.కిషన్ నా పేరులో ఒక భాగమని నేను మర్చిపోయాను. సందీప్ కిషన్ అనేది 15 సంవత్సరాల క్రితం మీరు నాకు ఇచ్చిన గుర్తింపు. నేను గర్వంగా మరియు బాధ్యతతో తీసుకువెళుతున్న గుర్తింపు.
నేను చేసే ప్రతి పనిలోనూ నా ఉద్దేశం, ఆశయం మరియు ప్రయత్నం అత్యుత్తమంగా ఉండేలా చూసుకోవడానికి నేను ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. నేను కొన్ని సార్లు పెద్ద విజయాలు సాధించాను, చాలాసార్లు ఓడిపోయాను. కానీ నేను నా కంప్లీట్ ఎఫర్ట్స్ ఇచ్చానని మీకు తెలుసు. నేను ఎప్పుడు అదే నమ్మకంతో ఉంటాను.
A Love Letter to All My Friends , Well Wishers and Fans ♥️
Thank you for Creating me 15 years ago ♥️
And to all my Naysayers and Targeted Haters it’s ok you can read it too, I shall win you over time too 🙂
Saving this Tweet to revisit it April 16th 2026 🤟🏽 pic.twitter.com/gCCPIkpdzq
— Sundeep Kishan (@sundeepkishan) April 16, 2025
నేను ఎల్లప్పుడూ కేస్ స్టడీలను నమ్ముతాను మరియు నా కెరీర్ కేస్ స్టడీ ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. ప్రతిసారీ నాకు అండగా నిలిచారు. నా గుడ్,బ్యాడ్ డేస్ లో మీరు ఉన్నారు. మీరు నా గుర్తింపు మరియు నేను ఈ రోజు ఉన్నానంటే మీకు రుణపడి ఉన్నాను. మీరు నా భయాలను తప్పుగా నిరూపించారు మరియు ప్రతిసారీ నాకు బలాన్ని ఇస్తారు. నేను మీ అందరినీ చాలా గర్వపడేలా చేస్తానని నా హృదయపూర్వకంగా మీకు మాట ఇస్తున్నాను. అదే నా అతిపెద్ద ఇన్స్పిరేషన్ మరియు ఆశయం.నా ప్రపంచంగా మీరు ఉన్నందుకు ధన్యవాదాలు మరియు దానిని ఇంత అందంగా చేసినందుకు ధన్యవాదాలు.
Also Read : Retro : రెట్రో సినిమాలో స్టార్ హీరోయిన్ డాన్స్ సాంగ్