Shekar Basha: సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వారి పర్సనల్ లైఫ్‌కు సంబంధించి చిన్న రూమర్ బయటికి వచ్చినా.. అది రూమరా, కాదా అని తెలుసుకోకుండానే చాలామంది దానిని వైరల్ చేస్తుంటారు. అలాగే కొన్నాళ్ల క్రితం యంగ్ హీరో రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ గురించి ఒక విషయం బయటపడింది. తను గత కొన్నేళ్లుగా లావణ్య అనే అమ్మాయితో సహ జీవనం చేస్తున్నాడనే వార్త బయటికొచ్చింది. ఈ విషయాన్ని లావణ్యనే స్వయంగా బయటపెట్టింది. అప్పటినుండి ఇప్పటివరకు రాజ్ తరుణ్, లావణ్య వివాదం ఎన్నో మలుపులు తిరిగింది. ఇక అనుకోకుండా ఈ వివాదంలోకి ఆర్జే, బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా కూడా ఎంటర్ అయ్యాడు.
సీన్‌లోకి శేఖర్ బాషా
రాజ్ తరుణ్ (Raj Tarun)పై లావణ్య (Lavanya) ఎన్నో ఆరోపణలు చేస్తున్న సమయంలో శేఖర్ బాషా రంగంలోకి దిగాడు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని ఆధారాలతో సహా బయటపెట్టాడు. దీంతో రాజ్ తరుణ్‌పై లావణ్య చేసిన ఆరోపణలు కొంతవరకు అబద్ధమని తేలిపోయి ఈ హీరో నిర్దోషిగా బయటపడ్డాడు. అప్పటినుండి శేఖర్ బాషాను కూడా టార్గెట్ చేసింది లావణ్య. ప్రస్తుతం రాజ్ తరుణ్, లావణ్య కేసు కోర్టులో రన్ అవుతోంది. అందుకే గత కొన్నిరోజులుగా ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ తాజాగా తనను లావణ్య ఇంట్లో నుండి గెంటేసిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు రోడ్డెక్కారు. దీంతో ఈ వివాదంలోకి మరోసారి శేఖర్ బాషా ఎంటర్ అయ్యి అసలు విషయం చెప్పాడు.
కొడుకు కోసం భరించారు
‘‘ఇంట్లో అందరూ కలిసే ఉండేవాళ్లు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులను లావణ్య పచ్చిబూతులు తిట్టి, హింసలు పెట్టేది. అప్పుడు కూడా కొడుకు కోసం కొన్నాళ్లు భరించారు. ఆ తర్వాత ఆయనకు కాలికి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ వల్ల ఆయన వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పుడు లావణ్య డ్రగ్స్ కేసులో పట్టుబడి 45 రోజులు చంచల్‌గూడ జైలులో ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వస్తే వారిని కూడా డ్రగ్స్ కేసులో యాడ్ చేస్తారేమో అన్న భయంతో రాజ్ తరుణ్, తన తల్లిదండ్రులు ఇక్కడికి రావడం మానేశారు. ఇదే అదునుగా లావణ్య ఇంటిని ఖబ్జా చేసేసింది’’ అని చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా (Shekar Basha). ఇక ఈ ఇల్లు కొనే విషయంలో లావణ్య తండ్రి సాయం ఉందని ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని అన్నాడు.
Also Read: రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లో నుండి గెంటేసిన లావణ్య.. ఎవరు చెప్పేది నిజం.?
రౌడీయిజం చేస్తుంది
ఆపై లావణ్యపై కమ్యూనిటీ స్టాఫ్, పక్కింటివాళ్లు ఇచ్చిన ఫిర్యాదులను చదివి వినిపించాడు శేఖర్ బాషా. ‘‘ఈ ఇంట్లో డ్రగ్స్ వినియోగం జరుగుతుంది. పార్టీలు, గట్టిగా అరవడాలు, కొట్టడాలు జరుగుతూ ఉంటాయి. ఎవరో తెలియని వాళ్లను తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర అసాంఘిక కార్యకలాపాలు చేయడం.. ఇవన్నీ ఇక్కడి వాళ్లు ప్రశ్నించారు. పైగా లావణ్య ఇక్కడ మెయింటేనెన్స్ కట్టదట. అడిగితే రౌడీయిజం చేస్తుంది, పచ్చిబూతులు తిడుతుంది. ఇలాంటి ఫిర్యాదులు అన్నీ వస్తుంటే నిజంగానే ఇది జరుగుతుందా లేదా అని చూడడానికి వాళ్లు వచ్చినట్టున్నారు’’ అంటూ తాజాగా రాజ్ తరుణ్ ఇంట్లో జరిగిన వివాదం గురించి చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా.
రాజ్ తరుణ్ తల్లిదండ్రులను లావణ్య హింసలు పెట్టింది: శేఖర్ బాషా
అయినా కొడుకు కోసం వాళ్లు చాలా భరించారు.
ఈ రోజు సొంత ఇంట్లోకే వాళ్లను వెళ్లనివ్వకుండా లావణ్య చేసింది.
డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత లావణ్యను దూరం పెట్టారు.
– శేఖర్ బాషా https://t.co/3XtP56ft4t pic.twitter.com/x3339lxpO4— ChotaNews App (@ChotaNewsApp) April 16, 2025