Pooja Hegde : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న మెగా హీరోస్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ముకుంద సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన అదే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది పూజ హెగ్డే. ఆ తర్వాత పూజ హెగ్డే అనేక సినిమాలు చేసి తనకంటూ మంచి పేరు సాధించుకుంది. అల్లు అర్జున్ సరసన చేసిన డీజే సినిమా పూజా హెగ్డే కి మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ తర్వాత గద్దలకొండ గణేష్ సినిమా కూడా పూజ హెగ్డే కెరియర్ లో మంచి హిట్ అయింది. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురంలో సినిమాలు పూజా హెగ్డే కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. మహేష్ బాబు ,ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి మంచి పేరును సాధించుకుంది పూజ హెగ్డే.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పూజా హెగ్డే కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కూడా పూజ హెగ్డే నటించాల్సి ఉంది. కానీ కొన్ని తెలియని కారణాల వలన పూజ హెగ్డే ఆ సినిమా నుంచి తప్పుకుంది. అయితే పూజ హెగ్డే తో కొంత షెడ్యూల్ కూడా పూర్తి చేసింది చిత్ర యూనిట్. దానికి సంబంధించిన ఫోటోలు కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన ఫొటోల్లో పూజ హెగ్డే చాలా అందంగా కనిపిస్తుంది.ఇకపోతే పూజ హెగ్డే సినిమా చేసి చాలా రోజులైంది అని చెప్పొచ్చు. పూజా హెగ్డే నటించిన “కీసీ కా భాయ్ కీసీ కా జాన్” సినిమా హిందీలో పర్లేదు అనిపించుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక ప్రాజెక్టు కూడా సైన్ చేయలేదు పూజా హెగ్డే.
అది రియల్ వరల్డ్ కాదు
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటిస్తున్న రెట్రో సినిమాలో పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. సూర్య కూడా ఒక హిట్ సినిమా చేసి చాలా ఏళ్లు అయింది. ఈ సినిమాతో సూర్య కం బ్యాక్ ఇస్తాడని సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక పూజ హెగ్డే విషయానికొస్తే, ప్రస్తుతం సినిమాలు వరుసగా స్పీడుగా చేయకపోయినా కూడా తనకు దాదాపు 27 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే వీటి గురించి పూజా హెగ్డే స్పందిస్తూ నాకు 30 మిలియన్ ఫాలోవర్స్ ఉండొచ్చు కానీ వాళ్లందరూ సినిమాకి వస్తారు అని నేను అంచనా వేయను. చాలా స్టార్డం ఉన్న హీరోలకి 5 మిలియన్ కూడా ఉండకపోవచ్చు. అదంతా రియల్ వర్డ్ కాదు. అని రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు.
Also Read : Khushboo Sundar: మీ లోపల అంతా మురికే.. నెటిజన్ ప్రశ్నకు కుష్బూ ఘాటు రిప్లై..!