Mazaka Movie : మజాకా మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ అయింది. చిరంజీవి దగ్గర వరకు వెళ్లిన కథ కావడంతో… మంచి అంచనాలే ఉండేవి ఈ మూవీపైన. మూవీ రిలీజ్ తర్వాత… చిరంజీవికి సెట్ అయ్యేది కాదు అని అర్థమైనా… సందీప్ కిషన్ – రావు రమేష్ కి మాత్రం సరిగ్గానే సెట్ అయింది. అయితే సెకండాఫ్‌లో ల్యాగ్ ఎక్కువ ఉండటంతో మిక్సిడ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ రన్ ఎలా ఉంటుందో… అని అందరూ అనుకున్నారు. తాజాగా వస్తున్న కలెక్షన్లను చూస్తే ఈ మూవీ మొత్తం డిజాస్టర్ అనే తెలిసిపోతుంది అని అంటున్నారు విశ్లేషకలు. డిజాస్టర్ అని ఎందుకు అంటున్నారు అనే డిటైల్స్ ఇప్పుడు చూద్దాం…
బెజవాడ ప్రసన్న కుమార్ కథ, త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన మూవీ ఈ మజాకా. ధమాకాతో 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ కాంబో ఇప్పుడు సందీప్ కిషన్ లాంటి హీరోతో చిన్న సినిమా చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే ఈ కథ కూడా మెగాస్టార్ చిరంజీవి – సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలు చేయాల్సింది అని తెలియడంతో… సినిమాపై హైప్ పెరిగింది.
బిజినెస్ కూడా అలానే జరిగింది. మజాకా మూవీ మొత్తం కలిపి 10.50 కోట్ల బిజినెస్ చేసింది. నైజాం ఏరియాలో ఈ మూవీ రైట్స్ 3.20 కోట్ల పలికింది. అలాగే సీడెడ్ లో 1.80 కోట్లు వరకు బిజినెస్ జరిగింది. ఇక మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ మొత్తం దాదాపు 4 కోట్ల వరకు బిజినెస్ అయింది. ఇక మిగిలిన రాష్ట్రాలు, ఓవర్సీస్ మొత్తం కలిపి వచ్చిన బిజినెస్ దాదాపు 1.5 కోట్లు. ఇలా మజాకా మూవీకి 10.50 కోట్ల బిజినెస్ జరగింది. అంటే… ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 11.20 కోట్ల వరకు ఉంది.
అయితే గడిచిన 5 రోజుల్లో ఈ మూవీ కలెక్షన్లను చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. మొదటి రోజు మజాకా మూవీకి కేవలం ఒక కోటి 25 లక్షలు మాత్రమే వచ్చింది. మిగిలిన 4 రోజుల్లో వచ్చిన మొత్తం 2.73 కోట్లు. మొత్తంగా ఈ 5 రోజుల్లో 3.98 కోట్ల షేర్ వచ్చింది. ఇక గ్రాస్ లో అయితే… 7.55 కోట్లే. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్సీస్ లో కలుపుకుని ఈ 5 రోజుల్లో మరో 77 లక్షల వరకు వచ్చాయి. అంటే… మొత్తంగా వరల్డ్ వైడ్ ఈ మూవీ.. 4.75 కోట్ల షేర్ వచ్చినట్టు సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే… మరో 6.50 కోట్ల వరకు రావాల్సి ఉంది.
సీడెడ్ ఏరియాలో అయితే… బయ్యర్లు దారుణంగా నష్టపోయారట. ఈ మూవీ రైట్స్ ను సీడెడ్ ల ఒక కోటి 80 లక్షలకు తీసుకున్నారు. కానీ, ఈ మూవీకి ఇప్పటి వరకు 40 లక్షలు కూడా రాలేవని టాక్. మొత్తంగా ఒక సీడెడ్ లోనే కోటి 20 లక్షల నుంచి కోటి 40 లక్షల వరకు బయ్యర్లు నష్టపోయారట.
తక్కువ బడ్జెట్ మూవీ, పైగా బిజినెస్ కూడా బాగానే జరిగింది. దీనికి తోడు… శాటిలైట్, ఓటీటీ రైట్స్ కూడా ఉన్నాయి. వీటితో ప్రొడ్యూసర్లు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. కానీ, అసలైన కష్టాలు ఇప్పుడు డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు వస్తుంది. మిక్సిడ్ టాక్ వచ్చినా… ఈ సినిమా కోసం ఆడియన్స్ థియేటర్ల గడప తొక్కడం లేదు. దీంతో 5 రోజులకే ఫైనల్ రన్ అయినట్టు ఫీల్ అవుతున్నారు.
దీనికి కారణం… సినిమాలోని కంటెంటే అని చెప్పొచ్చు. కమెడీ ఎంటర్టైనర్ కాబట్టి, ఫ్యామిలీని టార్గెట్ చేసుకోవాల్సింది. కానీ, సినిమాలో కొన్ని సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ను దూరం పెట్టేలా ఉన్నాయి. ఫలితంగా… ఒక వర్గం ఆడియన్స్ మాత్రమే థియేటర్స్ కి వస్తున్నారు. అది కూడా మిక్సిడ్ టాక్ రావడంతో… ఆ సంఖ్య పెద్దగా ఉండటం లేదు. దీనితో పాటు ప్రదీప్ రంగరాజన్ డ్రాగన్ మూవీకి కాస్త పాజిటిక్ టాక్ రావడంతో ఆ వర్గం ఆడియన్స్… ప్రియారిటీ డ్రాగన్ కే ఉంది.
సో… ఇలా అన్నీ చూసిన తర్వాత మజాకా మూవీ వాష్ అవుట్ అయినట్టే అని విశ్లేషకులు తేల్చి చేప్పేస్తున్నారు.