Mega DSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది శుభవార్త. త్వరలోనే మెగా డీఎస్సీ ద్వారా భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ చేపడతామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఏపీ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా స్కూల్ ప్రహరీల నిర్మాణం, డీఎస్సీపై ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేషన్ ఆన్సర్ ఇచ్చారు. త్వరలోనే మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహారీ గోడల నిర్మాణం పూర్తి చేయాలంటే రూ.3వేల కోట్లు ఖర్చు అవుతోందని చెప్పారు. మన బడి- మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద దశల వారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ను కూటమి సర్కార్ చేపట్టిందని అన్నారు.
పేరెంట్- టీచర్ మీటింగ్ లో భాగంగా ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రణాళికల వేస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 117 జీవోతో నిరుపేదలకు విద్యను దూరం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో 12 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారని అన్నారు. దీనిపై ఓ ప్రత్యామ్నాయంపై ఎమ్మెల్యేలతో చర్చించాలని నిర్ణయించామని అన్నారు. సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తున్నామని మంత్రి చెప్పారు.
ALSO READ: TGPSC Group-2,3 Results: గ్రూప్-2,3 ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది.. కొత్త నోటిఫికేషన్లు కూడా..?
రంప చోడవరం నియోజకవర్గంలో 80 స్కూళ్లలో మౌలిక సదుపాయలు కల్పిస్తున్నామని మంత్రి నారా లోకేషన్ పేర్కొన్నారు. స్కూళ్ల ముందు సీసీ టీవీలు, లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఆఫ్ ఏపీ’ కింద సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు తెచ్చి అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా సీఎస్ఆర్ ద్వారా అభివృద్ధి చేస్తున్నారో.. అలాగే తాము కూడా చేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.