BANK OF BARODA: నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించిన వారికి మంచి అవకాశం.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. దరఖాస్తుకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా(BANK OF BARODA ) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్, మేనేజర్-డెవలపర్ ఫుల్‌స్టాక్, ఆఫీస్-డెవలపర్, సీనియర్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మార్చి 11వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓ సారి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసేద్దాం.
బ్యాంక్ ఆప్ బరోడా భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 518
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు రకాల పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టుల వారీగా..
సీనియర్ మేనేజర్, మేనేజర్-డెవలపర్ ఫుల్‌స్టాక్, ఆఫీస్-డెవలపర్, సీనియర్ మేనేజర్, ఆఫీసర్-క్లౌడ్ ఇంజినీర్, ఆఫీసర్-ఏఐ ఇంజినీర్, మేనేజర్-ఏఐ ఇంజినీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్ ఏపీఐ డెవలపర్, మనేజర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్- నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ తదితర పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 11
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. పోస్ట్ గ్రేడ్-ఎంఎంజీ/ఎస్-3 కి 27 నుంచి 37 ఏళ్లు, ఎంఎంజీ/ఎస్-2 కు 24 నుంచి 34 ఏళ్లు, జేఎంజీ/ఎస్-1కు 22 నుంచి 32 ఏళ్లు, ఎస్‌ఎంజీ/ఎస్-4కు 33 నుంచి 43 ఏళ్ల వయస్సు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు పోస్ట్ గ్రేడ్- జేఎంజీ/ఎస్-1కు రూ.48,480, ఎంఎంజీ/ఎస్-2కు రూ.64,820, ఎంఎంజీ/ఎస్-3కు రూ.85,920, ఎస్‌ఎంజీ/ఎస్-4కు రూ.1,02,300 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100 ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మెరిట్ స్కోర్ వచ్చిన వారు ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bankofbaroda.in
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. అప్లై చేసుకుండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్యమైనవి..
మొత్తం పోస్టుల సంఖ్య: 518
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 11
* ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది.