Tollywood Producer : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలలో సునీల్ నారంగ్ ఒకరు. కేవలం సినిమాలో నిర్మించడం మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా థియేటర్స్ కలిగి ఉన్న వ్యక్తిగా సునీల్ కు మంచి పేరు ఉంది. థియేటర్స్ బిజినెస్ అనేది వీళ్లు నాన్నగారు కాలం నుంచి నడుపుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటం వలన పలు రకాల ఇంటర్వ్యూస్ లో నేను కనిపిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది హీరోలతో కలిసి ఏషియన్ థియేటర్స్ ను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సైతం ఈయనతో చేతులు కలిపి థియేటర్లను నిర్మించారు. ఇక ప్రస్తుతం ఈయన నిర్మాతగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా వస్తుంది.
మెగా కాంపౌండ్ నుంచి వార్నింగ్
తెలంగాణ ఫిలం చాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే సునీల్ నారంగ్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెక్రటరీ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు సునీల్ నారంగ్‌ను ఇబ్బందుల్లో పెట్టాయి. హీరోకు రూ.13 కోట్లు ఎందుకు ఇస్తున్నారు? కనీసం 2 కోట్లు కూడా కలెక్షన్స్ రావడం లేదంటూ (విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డను ఉద్దేశిస్తూ) స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ మాట్లాడటం వల్ల సునీల్ ఇరకాటంలో పడ్డారు. శ్రీధర్‌కు ఉన్నది ఒక్క థియేటరే. కానీ, సునీల్ నారంగ్.. టాలీవుడ్ హీరోలతో థియేటర్లు నడుపుతున్నారు. రవితేజాతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఓ థియేటర్ నిర్మిస్తున్నారు. ఇంకా మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో థియేటర్లు నడుపుతున్నారు. దీంతో సునీల్‌పై పెద్ద హీరోలు మండిపడినట్లు టాక్. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి కూడా వార్నింగ్స్ వచ్చినట్లు తెలిసింది. అందుకే ఆయన అంత స్పీడుగా రాజీనామా చేశారనేది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.
నిర్మాతగా మంచి సినిమాలు లైనప్
ఒకవైపు థియేటర్ కి సంబంధించిన బిజినెస్ పక్కన పెడితే, మరోవైపు నిర్మాతగా అద్భుతమైన సినిమాలను నిర్మించే పనిలో పడ్డారు. మంచి మంచి దర్శకులను హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ములతో రెండు సినిమాలు నిర్మించిన నారంగ్, మరోసారి మూడవ సినిమా అని కూడా చేయడానికి సిద్ధమయ్యారు. అలానే 96 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సి ప్రేమ్ కుమార్ కూడా ఈయన నిర్మాణంలో సినిమా చేయనున్నట్లు రీసెంట్ గా ఇచ్చిన ఒక ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన జాక్ సినిమా తీసుకొని చాలా నష్టపోయాను అని పలు ఇంటర్వ్యూస్ లో బహిరంగంగానే చెప్పుకొచ్చారు సునీల్.
Also Read : SSMB 29: రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. లక్ అంటే ఈ హీరోదే?