BigTV English

SSMB 29: రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. లక్ అంటే ఈ హీరోదే?

SSMB 29: రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. లక్ అంటే ఈ హీరోదే?

SSMB 29: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాజమౌళి(Rajamouli) ఒకరు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రాజమౌళి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత ఈయన తదుపరి వరుస అవకాశాలను అందుకుంటూ ఇప్పటివరకు ఒక్క అపజయం లేకుండా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి, RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్ అవార్డు(Oscar Award) కూడా అందుకున్నారు.


ఇలా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన పేరు హాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. తదుపరి రాజమౌళి మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.  ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా ఓ అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో రాజమౌళి మహేష్ బాబు ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రిజెక్ట్ చేసిన విక్రమ్….


రాజమౌళి ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram) ను కలిసారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం విక్రమ్ ని కలిసి కథ చెప్పిన అనంతరం విక్రమ్ రాజమౌళి సినిమాలో నటించడానికి ఆసక్తి చూపడం చూపటం లేదని, చాలా సున్నితంగా రాజమౌళి సినిమాని తిరస్కరించారని సమాచారం. ఇందులో విలన్ పాత్ర కోసం రాజమౌళి తనని సంప్రదించడం నాకు చాలా సంతోషంగా ఉందని విక్రమ్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం తన సినీ కెరియర్లో విలన్ పాత్రలు చేయటానికి సిద్ధంగా లేనని సమాచారం. ఇటీవల విక్రమ్ నటించిన “వీర ధీర సూరన్ 2” సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో విక్రమ్ హీరో-సెంట్రిక్సినిమాలను చేయాలనే ఆలోచనలో ఉన్నారట అందుకే ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

మాధవన్ అవకాశాన్ని ఉపయోగించుకుంటారా…

 

ఇక ఈ పాత్రలో నటించడానికి విక్రమ్ తిరస్కరించడంతో చిత్ర బృందం మరొక స్టార్ హీరో మాధవన్ (Madhavan)ను సంప్రదించారని తెలుస్తోంది. ఈ సినిమా కథ మొత్తం ఆయనకు వివరించగా మాధవన్ ఇప్పటికీ ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వలేదని, ఇంకా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే సామాన్యంగా ఏ ఒక్క నటుడు కూడా ఆ సినిమాను రిజెక్ట్ చేయరు, కానీ విక్రమ్ తన పరిస్థితుల కారణంగా రిజెక్ట్ చేశారు. ఇక మాధవన్ మాత్రం ఈ సినిమాకు ఓకే చెబుతారని  అభిమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా విషయంలో మాధవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.. ఇక ఇప్పటికే ఈ సినిమాలో మలయాళం పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) భాగమైన సంగతి తెలిసిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×