BigTV English

Sunny Leone Emotional Moment: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక ఇష్టం లేదని చెప్పి.. నా హృదయాన్ని ముక్కలు చేసాడు: సన్నిలియోన్!

Sunny Leone Emotional Moment: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక ఇష్టం లేదని చెప్పి.. నా హృదయాన్ని ముక్కలు చేసాడు: సన్నిలియోన్!
Sunny Leone Emotional Video
Sunny Leone Emotional Video

Sunny Leone Gets Emotional Over a Love Story: సన్నిలియోన్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. తన హాట్ ఫోజులతో కుర్రకారును మైమరిపించేలా చేస్తుంది. బాలీవుడ్ లో ఐటం సాంగ్స్ తో అల్లాండించింది సన్నిలియోన్. తెలుగు, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోనూ పలు పాటల్లోను తలుక్కున మెరిసింది. ప్రస్తుతం సన్నిలియోన్ చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి. ఇందులో ఒకటి స్పెషల్ సాంగ్ కాగా మిగిలిన వాటిలో కీలక పాత్రలో నటిస్తోంది. వీటితో పాటు ఈ బ్యూటీ స్ప్లిట్స్ విల్లా ఐదో సీజన్ కు జడ్జ్ గా వ్యవహరిస్తుంది.


ఇదిలా ఉంటే తాజాగా షోలో.. తన మనసు ముక్కలైన క్షణాలు గుర్తు చేసుకుంది. ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడు అని చెప్తూ భావోద్వేగానికి గురైంది. ఆ క్షణం ఎంతో బాధపడ్డానని చెప్పింది. నా పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించా. నిశ్చితార్దం కూడా జరిగింది. ఆ సమయంలో ఏదో తప్పు జరుగుతుందని నా మనసుకు అనిపించింది.

Also Read: టిల్లుగాడు రెండేళ్ల క్రితం చెప్పిందే ఇప్పుడు చేశాడు భయ్యా.. ఇది కదా డెడికేషన్ అంటే..?


చివరకు నేను ఊహించిందే జరిగింది. హవాయి దీవుల్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. ఇందుకోసం అన్ని సిద్ధం చేసుకున్నాం కాని పెళ్లికి రెండు నెలల ముందు నేనంటే ఇష్టం లేదని చెప్పాడు. ఆ సమయంలో నా హృదయం ముక్కలైంది. అప్పుడు నేను ఎంతో నరకం చూసాను. ఆ తర్వాత భగవంతుడు నా జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకొచ్చాడు.

డానియల్ వెబర్ ను పరిచయం చేసాడు. నా తల్లి దండ్రులు మరణించినప్పుడు కూడా నాకు తోడుగా ఉన్నాడు. ఎప్పటికి నా భర్త చేయి వదలను అని చెప్పుకొచ్చింది. కాగా సన్నిలియోన్ – డానియల్ వెబర్ 2011 లో వివాహం చేసుకున్నారు. 2017 లో నిషా అనే పాపను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత సిరోగసి ద్వారా ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులు అయ్యారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×