Hero Darshan:కన్నడ సినీ పరిశ్రమలో అభిమానిని హీరో హత్య చేసిన సంఘటన ఎంత కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ప్రేయసి కోసం అభిమానిని హత్య చేయించిన ఘటనలో హీరో దర్శన్ (Darshan) కొంతకాలంగా జైలు జీవితం అనుభవించి, ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు ఈయనకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను బెంగళూరు పోలీసులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు హీరో దర్శన్ కు నోటీసులు జారీ చేసింది. నిందితులు అమానవీయంగా వ్యవహరించిన తీరును ప్రభుత్వ న్యాయవాదులు ప్రస్తావించారు.
దర్శన్ తో సహా ఏడుగురికి నోటీసులు పంపించిన సుప్రీంకోర్టు..
అసలు విషయంలోకి వెళితే అభిమానిని హత్య చేసిన కేసులో కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత కర్ణాటక హైకోర్టు A1 గా పవిత్ర గౌడ (Pavitra Gowda) , A2 గా దర్శన్ తో సహా ఏడుగురు ప్రధాన నిందితులకు బెయిలు మంజూరు చేసింది. కానీ బెంగళూరు పోలీసులు నిందితుల బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. జనవరి 24న విచారణ జరగగా, ఈ సమయంలో ఏడుగురు నిందితులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
నిందితులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగళూరు పోలీసులు..
ఇకపోతే గత ఏడాది రేణుకా స్వామి (Renuka swamy) హత్య కేసులో ఈ ఏడుగురి నిందితులకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. బెయిల్ మంజూరు పై ప్రభుత్వ అనుమతిని తీసుకున్న తర్వాతనే బెంగళూరు పోలీసులు ప్రశ్నిస్తూ మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న (జనవరి 24) ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ముఖ్యంగా నిందితులు అమానుషంగా ప్రవర్తించారు కాబట్టి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని వారు వాదించారు. దీంతో నిందితులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి మిగిలిన నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న కూడా ఇది వర్తించదు. హైకోర్టు తీర్పులు వర్తించవని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ కోర్టు విచారణను వాయిదా వేసింది.
హత్యాపాపం వెంటాడుతోందా.
దర్శన్ ఒక సెలబ్రిటీ మాత్రమే కాదు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు కూడా. సాక్ష్యులను వక్రీకరించేందుకు ఆయన ప్రభావాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే హైకోర్టు పరిగణించని అనేక అంశాలను పేర్కొంది. ప్రస్తుతం దర్శన్ బెయిల్ మీద బయటకు వచ్చి ‘డెవిల్’ సినిమాలో త్వరలో నటించనున్నాడు. ఒకసారి బెయిల్ రద్దు చేస్తే మాత్రం మళ్లీ ఆయన జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఒప్పుకున్న డెవిల్ సినిమా పరిస్థితి ఏంటి అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా దర్శన్ మెడకు రోజు రోజుకు ఈ హత్యా పాపం చుట్టుకుంటుందని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే దర్శన్ సొంత భార్య, పిల్లలను కాదని సహనటి పవిత్ర గౌడతో రిలేషన్ లో ఉండడం వల్లే.. అభిమాని రేణుక స్వామి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తిస్తూ కామెంట్లు చేశారు. దీంతో అవమానంగా భావించిన ఈమె.. దర్శన్ తో పాటు మరి కొంత మందితో కలిసి రేణుక స్వామిని అత్యంత ఘోరంగా హతమార్చారు. ఈ కేసులోనే ప్రస్తుతం వీరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు.