BigTV English

Surekha Vani: మేము బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయలేదు.. సుప్రిత కేసుపై స్పందించిన సురేఖ వాణి

Surekha Vani: మేము బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయలేదు.. సుప్రిత కేసుపై స్పందించిన సురేఖ వాణి

Surekha Vani: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన వార్తలే ప్రసారమవుతున్నాయి. ఒకప్పుడు విపరీతంగా ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి చాలా డబ్బును వెనకేసుకున్నారు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లు. వారి ప్రమోషన్స్ వల్ల చాలామంది యూత్ దీనికి అట్రాక్ట్ అయ్యారు. దానివల్ల వారి కుటుంబాలకు ఎంతో నష్టం జరిగింది. అందుకే బెట్టింగ్ యాప్స్‌పై ఎలాగైనా యాక్షన్ తీసుకోవాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం గురించి ఇన్‌ఫ్లుయెన్సర్లకు తెలియగానే ఒక్కొక్కరిగా తమ తప్పును తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇక సురేఖ వాణి కుమార్తె సుప్రిత కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై తను నేరుగా స్పందించింది.


సురేఖ వాణి స్పందన

టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి కుమార్తె సుప్రిత (Supritha) కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌గానే సెటిల్ అయ్యింది. తనకు సినీ పరిశ్రమతో నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా సోషల్ మీడియా ద్వారానే విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంది. అలా తను సోషల్ మీడియాలోనే ఎన్నో బ్రాండ్స్‌కు ప్రమోషన్స్ కూడా చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. అందులో భాగంగానే పలుమార్లు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను కూడా ప్రమోట్ చేసింది. ఇక తాజాగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై అధికారులు యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టడంతో సుప్రిత ముందుకొచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పింది. ఇక దీనిపై సురేఖ వాణి సైతం స్పందించింది.


పోస్ట్ చేశాం అంతే

తాజాగా తన కుమార్తె బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం గురించి సురేఖ వాణిని సంప్రదించారు బిగ్ టీవీ రిపోర్టర్. అసలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎవరు అప్రోచ్ అయ్యారనే విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ‘‘మేము ప్రత్యేకంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయలేదు. వాళ్లు కొన్ని పోస్టులు పెట్టి ఆ పోస్ట్‌ను రీపోస్ట్ చేయమని చెప్పేవాళ్లు అంతే’’ అని చెప్పుకొచ్చింది సురేఖ వాణి. అంటే తన కూతురు ప్రత్యేకంగా ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసింది అనే విషయాన్ని సురేఖ వాణి (Surekha Vani) నేరుగా ఒప్పుకోలేదు. కేవలం సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేసిందని మాత్రమే చెప్పుకొచ్చింది.

Also Read: విష్ణుప్రియాకు నోటిసులు.. ఏ క్షణమైనా అరెస్ట్.?

తెలియకుండా చేశాం

బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత నష్టం కలిగిస్తాయో తెలియకుండా వాటి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఇప్పుడు సారీ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని సురేఖ వాణికి ప్రశ్న ఎదురయ్యింది. ‘‘తెలియకుండా చేసిన దానికే తెలియకుండా చేశాం సారీ అని చెప్తున్నాం. తెలియకుండా ఎందుకు చేశారంటే తెలియకుండానే చేశాం. సమాచారం తెలియకుండా పోస్ట్ చేసినందుకే సారీ చెప్పాం’’ అంటూ సీరియస్‌గా సమాధానమిచ్చింది సురేఖ వాణి. ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి ఇప్పుడు అది తప్పు అని తెలిసి సారీ చెప్పినా కూడా సురేఖ వాణి కూతురు సుప్రితపై యాక్షన్ తీసుకోవాలని అధికారులు ఫిక్స్ అయ్యారు. తనతో పాటు మరెందరో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై యాక్షన్ తీసుకోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×