BigTV English

Chhaava: ‘ఛావా’ ఖాతాలో మరో రికార్డ్.. బుక్ మై షోలో ఇదే మొదటిసారి..

Chhaava: ‘ఛావా’ ఖాతాలో మరో  రికార్డ్.. బుక్ మై షోలో ఇదే మొదటిసారి..

Chhaava: చాలాకాలంగా సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ కాస్త వెనకబడి ఉందనే చెప్పాలి. సౌత్ నుండి ఏ సినిమా వచ్చినా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు దానిని విపరీతంగా ఆదరిస్తున్నారు. అంతే కాకుండా సౌత్‌లో తెరకెక్కే పాన్ ఇండియా చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఇక్కడి సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ చాలా వెనకబడి పోయింది. కానీ అప్పుడప్పుడు హిందీ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ను అందుకుంటున్నాయి. అలా చాలాకాలం తర్వాత హిందీలో విడుదయ్యి దేశవ్యాప్తంగా కలెక్షన్స్ విషయంలో రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతున్న చిత్రం ‘ఛావా’. తాజాగా ఈ సినిమా ఖాతాలో మరొక రికార్డ్ వచ్చి చేరింది.


కొత్త రికార్డ్

విక్కీ కౌశల్ హీరోగా నటించిన ‘ఛావా’ థియేటర్లలో విడుదలయ్యి దాదాపు నెలరోజులు అయ్యింది. అయినా ఇంకా చాలావరకు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఛత్రపతి సాంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఛత్రపతి శివాజీ గురించి చాలామంది తెలుసు. కానీ ఆయన కుమారుడు అయిన సాంభాజీ మహారాజ్ గురించి చాలా తక్కువమందికి తెలుసు. అలా చాలామందికి తెలియని చరిత్రను తెలియజేసినందుకు మేకర్స్‌కు థాంక్యూ చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఇప్పటికీ ఈ మూవీ కలెక్షన్స్ విషయంలోనే కాకుండా తాజాగా మరొక కొత్త రికార్డ్ కూడా బ్రేక్ చేసింది.


ఆ సినిమాను దాటేసింది

ఇప్పటివరకు బుక్ మై షో (Book My Show)లో ‘ఛావా’ సినిమా కోసం 12 మిలియన్ల టికెట్లు బుక్ అయ్యాయి. ఒక హిందీ సినిమాకు ఈ రేంజ్‌లో టికెట్లు బుక్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి. దీంతో ఈ సినిమా ఖాతాలో మరొక రికార్డ్ చేరిందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటికీ ఈ మూవీ చూడడం కోసం బుక్ మై షోలో టికెట్లను బుక్ చేసుకుంటూనే ఉన్నారు ప్రేక్షకులు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా బుక్ మై షో యాజమాన్యం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. శ్రద్ధ కపూర్, రాజ్‌కుమార్ రావు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్త్రీ 2’ టికెట్ సేల్స్‌ను ‘ఛావా’ దాటేసిందని తెలిపింది.

Also Read: బ్రేకప్ చేసిన గాయం.. తమన్నాలో ఇంత మార్పా.!

గుర్తుండిపోయే సినిమా

ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.550 నెట్ కలెక్షన్స్ సాధించింది ‘ఛావా’ (Chhaava). విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ మూవీలో మహారాణి యేసుబాయ్‌గా రష్మిక మందనా కనిపించింది. లక్షణ్ ఉతేకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇక టికెట్ సేల్స్ విషయానికొస్తే ‘స్త్రీ 2’ రికార్డును ‘ఛావా’ బ్రేక్ చేసినందుకు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముంబాయ్, పూణే, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు, నాగ్‌పూర్, నాషిక్, అహ్మదాబాద్, కోలకత్తా, లక్నో వంటి ప్రాంతాల్లో ‘ఛావా’కు ఇప్పటికీ బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వస్తుందని బుక్ మై షో యాజామన్యం చెప్పుకొచ్చింది. హిస్టరీ, కల్చర్‌ను ప్రేక్షకులకు తెలిసేలా చేసిన ఈ సినిమా ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుందని ఇండస్ట్రీ నిపుణులు సైతం భావిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×