E-Paper
Advertisement

American Bank Crisis : ముంచుకొస్తున్న మరో సంక్షోభం.. మూతబడిన అమెరికన్ బ్యాంక్

American Bank Crisis : ముంచుకొస్తున్న మరో సంక్షోభం.. మూతబడిన అమెరికన్ బ్యాంక్
Advertisement

American Bank Crisis : ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ బ్యాంకింగ్ క్రైసిస్ ఉంది. పైకి కనిపించడం లేదు గానీ.. నివురు గప్పిన నిప్పే అది. అతి త్వరలోనే ఏ క్షణమైనా బద్దలు కావొచ్చన్నది ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ మాట. అదే జరిగితే… ప్రపంచం మరో భారీ సంక్షోభాన్ని చూడక తప్పదు. ఇప్పటికే కంపెనీలు లక్షల ఉద్యోగులను తీసేశాయి. బ్యాంకులు మూసుకుపోతే.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలే దివాళా తీసి మూసుకుపోయే ప్రమాదం ఉంది. గ్రేట్ రెసిషన్‌కు ఛాన్స్ ఉందన్న ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అమెరికాతో పాటు యూరప్ దేశాల్లోని చాలా బ్యాంకులు స్ట్రెస్‌లో ఉన్నాయి. బ్యాంకింగ్ ఆపరేషన్స్ విషయంలో చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. యూరోపియన్ మీడియా అక్కడి నెగటివ్ వార్తలను పెద్దగా పబ్లిష్ చేయదు. అంతెందుకు యూరప్ జోన్ మొత్తం రెసిషన్‌లో ఉందన్న విషయాన్ని ప్రపంచానికి కనపడనివ్వకుండా దాచేస్తోంది. కాని, జర్మనీ, గ్రీస్, బ్రిటన్ సహా చాలా దేశాలు రష్యా-ఉక్రెయిన్ వార్ దెబ్బకి చాలా దారుణంగా దెబ్బతిన్నాయి.

Advertisement

ఓవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ధరలను కంట్రోల్ చేయడానికి వడ్డీరేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. బతకడమే కష్టంగా ఉంటే.. ఇక వడ్డీలు ఎలా కడతారు. సో, ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సంక్షోభం పొంచి ఉంది. దీనికి సంకేతంగానే అమెరికాలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ మూతపడింది. నెల క్రితమే ఫస్ట్ రిపబ్లిక్ గురించి తెలీసినప్పటికీ… అఫీషియల్‌గా ఈ అమెరికన్ బ్యాంక్ మూతపడింది. జేపీ మోర్గాన్ ఛేజ్ సంస్థ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను కొనేసింది.

ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ ప్రాపర్టీస్‌ను జేపీ మోర్గాన్‌ ఛేజ్ సొంతం చేసుకుంది. 173 బిలియన్‌ డాలర్ల లోన్లతో సహా 30 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలు కూడా కొనుగోలు చేసింది. వీటితో పాటు రిపబ్లిక్ బ్యాంక్‌లో ఉన్న 92 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు కూడా జేపీ మోర్గాన్ సొంతమయ్యాయి. అయితే పస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌కు చెందిన కార్పొరేట్‌ అప్పులు, స్టాక్స్‌ పై ఎలాంటి బాధ్యత తీసుకోబోమని జేపీ మోర్గాన్‌ చెప్పినట్టు తెలుస్తోంది. 

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×