BigTV English

Suriya: ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సూర్య..

Suriya: ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సూర్య..
Advertisement

Suriya: హీరోల పుట్టినరోజులు వస్తే.. బర్త్ డే కేకులు కట్ చేయడాలు, కటౌట్ లకు పాలాభిషేకాలు,పూలాభిషేకాలు చేస్తూ ఉంటారు అభిమానులు. ఇంకొంతమంది అన్నదానం, రక్తదానం చేస్తూ ఉంటారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో పుట్టినరోజు దగ్గరపడుతుండటంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.


ఇక ఈ రక్తదాన శిబిరాన్ని నేడు సూర్య సందర్శించాడు. సందర్శించడమే కాకుండా.. తాను కూడా రక్తం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. అయితే వీరికి ఇదేమి కొత్త కాదు.. సూర్య జన్మదిన వేడుకల్లో భాగంగా అభిమానులు ప్రతి సంవత్సరం తమిళనాడు వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటారు. సూర్య పుట్టినరోజు అయినా జూలై 23 న పండగలా సెలబ్రేట్ చేస్తారు.

గతేడాది దాదాపు 2000 మంచి రక్తదానం చేశారు. ఇక ఆ సమయంలోనే 2024లో నిర్వహించే శిబిరానికి హాజరవుతారని సూర్య.. ఫ్యాన్స్‌కు మాట ఇచ్చాడు. ఇక ఇచ్చిన మాటప్రకారం నేడు రక్తదాన శిబిరానికి వెళ్లి.. తాను కూడా రక్తం ఇచ్చాడు. అనంతరం ఫ్యాన్స్ తో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.


ఇక సూర్య లుక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పాలి. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సూర్య చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది కాకుండా వాడీ వసూల్ ఒకటి షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ సినిమాలతో సూర్య ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×