Suriya:లోకనాయకుడు కమల్ హాసన్ పేరు ఈమధ్య సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన థగ్ లైఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నాయకుడు లాంటి హిట్ సినిమా తర్వాత మణిరత్నం- కమల్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. కానీ కమల్ వ్యాఖ్యల వలన ఈ సినిమా కర్ణాటకలో రిలీజ్ కాలేదు. ఇక ఈ వివాదం వల్ల కలెక్షన్స్ కూడా రాలేదు.
ఇండస్ట్రీలో భారీ డిజాస్టర్స్ అయినా కంగువ, ఇండియన్ 2 సినిమాల కన్నా థగ్ లైఫ్ కలెక్షన్స్ తక్కువ రావడంతో అత్యంత పరాజయం పాలైన సినిమాగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. థియేటర్ లో విజయాన్ని సాధించలేకపోయిన ఓటీటీలోనైనా కాసింత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందేమో అని అటు మేకర్స్ తో పాటు ఇటు ప్రేక్షకులు కూడా ఎదురుచస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే కమల్ ఒకపక్క హీరోగా ఇంకోపక్క నిర్మాతగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ ను స్థాపించి అందులో మంచి మంచి కథలను తెరకెక్కిస్తున్నాడు.
గతేడాది శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమాను కమల్ హాసనే నిర్మించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో స్టార్ హీరో తో కమల్ ఒక సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యాడు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కమలహాసన్ ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో విక్రమ్ సినిమా వచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోలెక్స్ పాత్రలో సూర్య నటించి మెప్పించాడు. విక్రమ్ సినిమాకు ఏదైనా హైలెట్ ఉంది అంటే అది రోలెక్స్ పాత్ర అని చెప్పాలి.
ఇక విక్రమ్ ప్రమోషన్స్ లో కమల్ హాసన్.. కచ్చితంగా సూర్యతో ఒక ఫుల్ లెంత్ మూవీ చేస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకుంటూ కమల్ సూర్యకు ఒక మంచి కథను వినిపించాడని కోలీవుడ్ వర్గాల్లో టాప్ నడుస్తుంది. చిత్త, వీరా ధీరసూరన్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది సమ్మర్ లోగా ఈ సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తుంది. ఈ వార్త తెలియడంతో ఫాన్స్ ఆనందంతో గంతులు వేస్తున్నారు విక్రమ్ బ్యానర్ ల రోలెక్స్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఊహించుకుంటున్నారు. ఇక సూర్య తెలుగులో వెంకీ అట్లూరితో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం సినిమాను వదులుకున్నాడని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. గత కొంతకాలంగా ప్లాప్స్ మధ్యలో కొట్టుమిట్టాడుతున్న సూర్యకు ఈ తెలుగు సినిమా ఊరటను అందిస్తుందో లేదో చూడాలి.