BigTV English

Jani Master: షాకింగ్.. అందరికీ థాంక్స్ చెప్తూ వీడియో పోస్ట్ చేసిన జానీ మాస్టర్

Jani Master: షాకింగ్.. అందరికీ థాంక్స్ చెప్తూ వీడియో పోస్ట్ చేసిన జానీ మాస్టర్

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హురించి, ఆయన కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జానీ మాస్టర్ పై ఒక డ్యాన్సర్.. లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెల్సిందే. ఈ కేసు జానీ మాస్టర్ జీవితాన్ని తారుమారు చేసింది. పరువు, గౌరవం, ఛాన్స్  లు అన్ని పోతూ వచ్చాయి. తనను  జానీ మాస్టర్ వేధించాడని, పెళ్లి చేసుకోమని, మతం మార్చుకోమని బలవంతం చేసినట్లు ఆమె  ఫిర్యాదులో తెలిపింది.


ఇక ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్ళాడు. అయితే జానీ మాస్టర్ భార్య.. బెయిల్ కోసం ప్రయత్నించగా మొదట  బెయిల్ వద్దన్న ఆయన .. ఆ తరువాత  తన తల్లి అనారోగ్యం కారణంగా బయటకు రావాలని కోర్టుకు కోరాడు. అప్పుడు  కోర్టు జానీ మాస్టర్ బెయిల్ ను రద్దు చేసింది.  ఇక ఎంతో ప్రయత్నించగా.. ఈరోజే  జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చింది. ఇక వచ్చిరాగానే జానీ మాస్టర్.. తన తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకొని.. ఆమె ఆశీర్వాదాలు తీసుకొని ఫోటో పెడతాడు అనుకుంటే.. తాను కొరియోగ్రఫీ చేసిన సాంగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను షేర్ చేసి షాక్ ఇచ్చాడు.

Matka: తస్సాదియ్యా.. జీవితం గురించి ఏం చెప్పాడ్రా.. అదిరిపోయింది పాట


లైంగిక వేధింపుల  కేసులో ఇరుక్కోక ముందు జానీ మాస్టర్ ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ ను ఒప్పుకున్నాడు. అందులో పుష్ప 2, భుల్ భూలయా 3 కూడా ఉన్నాయి. అయితే ఈ కేసు వలన మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా పుష్ప 2 నుంచి జానీ మాస్టర్ ను తొలగించినట్లు తెలిపారు. ఇక హిందీలో  భుల్ భూలయా 3 లో  టైటిల్ ట్రాక్ కు  జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. హరే రామ్ .. హరే రామ్ అంటూ సాగిన ఈ సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు.

యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఈ సాంగ్ కొనసాగుతోంది. ఆ స్టెప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. వివాదాల విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ  అంటే ఒక బ్రాండ్  అని చెప్పొచ్చు. ఇక తాజాగా ఈ సాంగ్ రికార్డులు సృష్టించడంతో.. జానీ మాస్టర్.. తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు.  ” నా సాంగ్ స్పూకీ  స్లైడ్  ను ట్రెండింగ్ లో ఉంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు” అంటూ చెప్పుకొస్తూ భుల్ భూలయా 3 టీమ్ ను ట్యాగ్ చేశాడు.

Avika gor: నా అనుకున్న వాళ్ళే అసభ్యకరంగా ప్రవర్తించారు.. అవికా ఎమోషనల్ కామెంట్స్..!

కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 1 న రిలీజ్ కు రెడీ అవుతుంది. చంద్రముఖి రీమేక్ గా భుల్ భూలయా తెరకెక్కింది. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ గా భుల్ భూలయా 2 ను రిలీజ్ చేశారు. అది కూడా సూపర్ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు భుల్ భూలయా 3  ను రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మంజులిక అనే దెయ్యంగా  విద్యాబాలన్ కనిపిస్తుండగా.. మూడో పార్ట్ లో కార్తీక్ ఆర్యన్ సరసన అనిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తోంది.  మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×