BigTV English

Suriya: మెగాస్టార్ పై సూర్య ప్రశంశలు.. చిరంజీవి లేకుంటే అది సాధ్యం కాదంటూ..?

Suriya: మెగాస్టార్ పై సూర్య ప్రశంశలు.. చిరంజీవి లేకుంటే అది సాధ్యం కాదంటూ..?

Suriya.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా కంగువ (Kanguva )చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి వైజాగ్ లో కంగువ సినిమా స్పెషల్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యతో.. డైరెక్టర్ శివ (Director Shiva) తెలుగు హీరోల గురించి చెప్పమని అడగుతూ.. పలువురు హీరోల పేర్లు చెప్పి, వాళ్ల గురించి ఒక్కమాటలో చెప్పాలని అడిగారు. దీంతో సూర్య ఒక్కో తెలుగు హీరో గురించి ఒక్క మాటలో చెప్పి అందరిని అబ్బురపరిచారు.


6000 మందికి సహాయం.. చిరంజీవి వల్లే సాధ్యం..

సూర్య మొదట మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి మాట్లాడుతూ.. నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా లేదా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే పర్సనల్ గా ఫోన్ చేసి నాకు విషెస్ చెప్పారు. అంతేకాదు ఇంటికి డిన్నర్ కి పిలిచి ఫిష్ కర్రీ , దోశ.. ప్రత్యేకంగా ఆయన చేత్తో నాకు వడ్డించారు. అలాగే నేను చెన్నైలో ఇల్లు కట్టుకోవడానికి, నేను ఎన్జీవో మొదలు పెట్టడానికి కూడా ఆయనే కారణం. ఆయన వల్లే ఇప్పుడు నేను 6000 మందికి పైగా స్టూడెంట్స్ కి చదువు విషయంలో సహాయ చేస్తున్నాను. నా ఇన్స్పిరేషన్ ఆయనే. రీసెంట్ గా కలిసినప్పుడు కూడా కంగువ గురించి ఆయన మాట్లాడారు. ఆయనను కలిసిన ప్రతీసారి కూడా నాకు ఓ కొత్త విషయం తెలుస్తుంది అంటూ చిరంజీవి గురించి చెప్పుకొచ్చారు. ఇకపోతే చిరంజీవి తనకు ఇన్స్పిరేషన్ గా మారి, పిల్లల భవిష్యత్తుకు సహాయ పడమని చెప్పడం ఒక ఎత్తైతే, సూర్య ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఏకంగా 6000 మంది పిల్లల చదువులకు హెల్ప్ చేయడం మరో ఎత్తు.. ఈ విషయాలు తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది మా హీరో రేంజ్ అంటే అంటూ సోషల్ మీడియాలో తమ అభిమాన హీరో పై ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.


చిరంజీవి మంచితనం..

ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య టాలీవుడ్ మెగాస్టార్ గురించి, ఆయన మంచితనం గురించి మరోసారి చెప్పడంతో చిరంజీవి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఈయన తన బ్యాంక్ ద్వారా.. అవసరమైన ఆపదలో ఉన్న ఎంతోమందికి కూడా రక్తం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇవే కాదు కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తారు. ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి చేసే మంచితనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.దీంతో సూర్యని కూడా మెగా అభిమానులు పొగిడేస్తూ ఉన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×