BigTV English

Visakha Sarada Peetham: సాములోరి బాకీ తీర్చేస్తా.. ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుందా..?

Visakha Sarada Peetham: సాములోరి బాకీ తీర్చేస్తా.. ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుందా..?

వారం రోజుల్లోగా తిరుమల అక్రమ నిర్మాణాలపై నివేదికకలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి తిరుమలలో విశాఖ శారదపీఠం అక్రమ నిర్మాణాలు.. ఈ ఒక్క అంశం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హిందు సమాజంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2005 ఫిబ్రవరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తిరుమలలోని గోగర్భం జలాశయ ప్రాంతంలో శారదా పీఠానికి ఐదు వేల చదరపు అడుగల భూమిని 30 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. టీటీడీ నిబంధనలు పాటించి అక్కడ నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ అధికారులు శారదా పీఠం నిర్వహకులకు సూచించారు. కానీ అది 2023 వచ్చే సరికి ఏకంగా 19,999 అడుగుల స్థలంలో నిర్మాణాలు చేపట్టింది. అంటే మూడంతస్తుల నిర్మాణానికి అనుమతులు తీసుకోని ఐదంతస్తులు నిర్మించారు. దీంతోపాటు గోగర్బం డ్యాం నుంచి వచ్చే కాలువను 30 అడుగుల మేర అక్రమించారు.

ఈవిధంగా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడితే 30 లక్షలు జరిమానా టిటిడి కట్టించుకుంది. దీంతో పాటు టిటిడి పాలక మండలి ఓ తీర్మానం చేసి మరి అక్రమ కట్టడాలను క్రమబద్దీకరణ చేశారు. ఇదే క్రమంలో విశాఖ శారదపీఠం అశ్రమ అక్రమ దందాలపై 2022లో హిందు సంఘాలకు చెందిన ఓంకార్ అనే న్యాయవాది హైకోర్టును అశ్రయించారు. దీనిపై కోర్టు ఓ న్యాయవాదితో కమీషన్ ఏర్పాటు చేసింది. అక్రమంగా కట్టడాలు నిర్మించారని నిర్ధారించి హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. అయితే హైకోర్టు తర్వాత ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపై స్వామీజీలు ,హిందు సంఘాల అందోళనపై టిటిడి ,ప్రభుత్వం స్పందించలేదు. అంతా కరెక్టు.. మేము జరిమానా కట్టించుకున్నామని హైకోర్టుకు సైతం నివేదిక ఇచ్చింది. ఇదే సమయంలో తిరుమలలో ఉన్న మిగతా మఠాలు ఏ స్థాయిలో అనుమతులు తీసుకున్నాయో ఎంత అక్రమించాయనేది టిటిడి రెవెన్యూ ఓ నివేదిక ఇచ్చింది. ప్రతి మఠం అంతో ఇంతో అక్రమించిందనేది బయటపడింది.


Also Read: దక్షిణాదికి జన బలం కావాల్సిందేనా?

తిరుమలలో ఇతర మొత్తం 23 మఠాలు ఉన్నాయి. వీటిలో మెజార్టీ మఠాలు తమకు కేటాయించిన స్థలం కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. వీటన్నింటి పై సమగ్రంగా విచారణ చేసింది టీటీడీ. తర్వాత చర్యలు మాత్రం తీసుకోలేదు. అయితే మాజీ టిటిడి బోర్డు చైర్మన్ ఏర్పేడు వ్యాసాశ్రమం వెనుక వైపు కర్నాటకు చెందిన ఓ మఠానికి అనుమతులు ఇచ్చారు. అందులో కేవలం మఠాన్ని మాత్రమే నిర్మించారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. తిరుమలలో వన్ ప్లస్ త్రి నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉండగా ఏకంగా ఐదంతస్తుల నిర్మాణం చేశారు. దీంతో శారద పీఠం తర్వాత నెక్ట్స్ చర్య ఈ మఠం మీదేనని టాక్ నడుస్తోంది.

ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఎంటంటే.. తిరుమలలో 30 మఠాలు ఉండగా ఇందులో 15 మఠాలలో విహహాలు జరుగుతుంటాయి. కళ్యాణమండపం లేక పోయిన హాలులో నిర్వహిస్తారు. మ్యారేజ్ కాంట్రాక్టర్లు చాలామంది ఈమఠాలలో వివాహం నిర్వహిస్తారు. ముఖ్యంగా పీఠాధిపతులు సంవత్సరానికి 50 నుంచి కోటి రూపాయల వరకు లీజు దారులనుంచి వసూలు చేస్తారు. దీంతో పాటు మఠాదిపతులు ,శిష్యులు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తుంటారు, పోతుంటారు. ఈ రకంగా కేవలం మఠాలతోనే ఇక్కడి మఠాధిపతులు ఏకంగా 500 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా.

మొత్తంగా విశాఖ శారదపీఠం కు అనుకూలంగా ఇచ్చిన తీర్మానాన్ని రద్దు చేసి అక్రమ నిర్మాణాలపై చర్యలకు సిద్ధమైంది టీటీడీ. ఈ నేపథ్యంలో టిటిడి ఓ సబ్ కమిటిని నియమించింది. వారంలోపు నివేదిక ఇవ్వాలని అదేశాలు జారీ చేసింది. ఇందులో బాగంగా కమిటిలో డిప్యూటీ ఇవో, సిఈ, టిటిడి లీగల్ అధికారి, టౌన్ ప్లానింగ్ అధికారిని నియమించారు. తిరుమలలో అశ్రమాలతో పాటు గెస్ట్ హౌస్ ల వివరాలు కూడా నివేదిక ఇవ్వాలని అదేశించింది. నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం ఎలా ఉంటుందో అన్న చర్చ ఇప్పుడు తిరుమలలో మొదలయింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×