BigTV English

Suriya: ఇలా కూడా వర్కవుట్స్ చేయొచ్చా? జిమ్‌లో హీరో సూర్య వీడియో వైరల్

Suriya: ఇలా కూడా వర్కవుట్స్ చేయొచ్చా? జిమ్‌లో హీరో సూర్య వీడియో వైరల్

Suriya: ఈరోజుల్లో సీనియర్ హీరోలు సైతం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటూ ప్రతీ సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం కోరుకుంటున్నారు. కోలీవుడ్ సీనియర్ హీరోల్లో సూర్య (Suriya) కూడా అంతే. సినిమా కోసం ఎంత కష్టపడడానికి అయినా సూర్య సిద్ధంగా ఉంటాడు. ప్రస్తుతం తను బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో వర్కవుట్స్ చేయడం కూడా మిస్ అవ్వడం లేదు. తన భార్య జ్యోతికతో కలిసి సూర్య చేసే వర్కవుట్స్ వీడియోలకు ఫ్యాన్స్ ఉన్నారు. కపుల్ గోల్స్ అంటే ఇలాగే ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తుంటారు. కానీ తాజాగా సూర్య సోలోగా కష్టమైన వర్కవుట్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది.


రెండు గెటప్స్‌లో

జిమ్‌లో ఒక మూవింగ్ ప్లాట్‌ఫార్మ్‌పై నిలబడి బ్యాలెన్స్ చేస్తూ సూర్య చేస్తున్న వర్కవుట్ వీడియో ఒకటి బయటికొచ్చింది. అది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 49 ఏళ్ల వయసులో కూడా ఇలాంటి వర్కవుట్స్ చేయడం గ్రేట్ అంటున్నారు. అంతే కాకుండా తన అప్‌కమింగ్ మూవీ ‘కంగువ’ (Kanguva) కోసం కండలు పెంచేసి ఫిట్‌గా కనిపించాడు సూర్య. ఏ సినిమాలో అయినా ఆ పాత్రకు తగినట్టుగా మారిపోవడం తనకు అలవాటే. ‘కంగువ’లో గిరిజన రాజు పాత్రలో మాత్రమే కాకుండా మరో మోడర్న్ లుక్‌లో కూడా కనిపించనున్నాడు ఈ హీరో. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని వాయిదా వేసుకున్న ‘కంగువ’.. ఫైనల్‌గా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.


Also Read: బాలీవుడ్‌‌పై డామినేషన్ కంటిన్యూ… సూర్య పకడ్బందీ ప్లాన్..!

భారీ డిమాండ్

ముందుగా 2024 సమ్మర్‌లోనే ‘కంగువ’ విడుదల కావాల్సింది. కానీ అప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. అసలు ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ ఉంటుందా లేదా అని టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్‌కు ఫైనల్‌గా గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. నవంబర్ 14న తమిళంలో మాత్రమే కాకుండా హిందీతో పాటు ఇతర సౌత్ భాషల్లో కూడా ‘కంగువ’ విడుదల కానుందని ప్రకటించారు. నవంబర్‌లో ఏ సౌత్ భాష నుండి ప్యాన్ ఇండియా మూవీకి రెడీగా లేదు. దీంతో ‘కంగువ’కు పెద్దగా పోటీ లేదు. అదే ధైర్యంతో ఓటీటీ, శాటిలైట్ రైట్స్ విషయంలో మేకర్స్ భారీగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. హిందీలో కూడా ఈ మూవీకి హైప్ క్రియేట్ చేయడం కోసం మూవీ టీమ్ కష్టపడుతోంది.

అప్డేట్స్ లేవు

‘కంగువ’ సినిమా షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లోకి అడుగుపెట్టగానే తన తరువాతి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు సూర్య. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా షూటింగ్ చాలాకాలం క్రితమే ప్రారంభమయ్యింది. అంతే కాకుండా ఈ మూవీ పలు షెడ్యూల్స్‌ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతున్నా కూడా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ బయటికి రాలేదు. ఇక తాజాగా తన కెరీర్‌లో 45వ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు సూర్య. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటివరకు ఆర్జే బాలాజీకి పెద్ద హీరోను డైరెక్ట్ చేసిన ఎక్స్‌పీరియన్స్ లేదు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×