Kanguva Trailer: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ట్రైలర్ రిలీజ్ కు రంగం సిద్ధం చేశారు. ఆగస్టు 12 న కంగువ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కంగువ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సూర్య డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
నిజం చెప్పాలంటే.. ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది. రెండు నెలలకు ముందే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లో సూర్య ఎంతో పవర్ ఫుల్ గా కనిపించాడు. సూర్య వెనుక రెండు రెక్కలు పెట్టి యూనిక్ గా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ సినిమా కాకుండా సూర్య44 లో నటిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ లోనే సూర్య తలకు గాయం అయ్యింది. ప్రస్తుతం సూర్య హెల్త్ నిలకడగా ఉందని సమాచారం. మరి ఈ సినిమాలతో సూర్య ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
The anticipation ends now! The time for glory is arriving ✨
Get ready for a celebration like no other ❤️🔥
The grand #KanguvaTrailer is all set to be yours from 12th August#KanguvaFromOct10 🦅 #Kanguva@Suriya_offl @DishPatani @thedeol @directorsiva @ThisIsDSP @StudioGreen2… pic.twitter.com/lICKb5Q8j0
— Kanguva (@KanguvaTheMovie) August 10, 2024