Best Romantic Movies on OTT : డిజిటల్ మీడియా ఈరోజుల్లో ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో వచ్చిన సినిమాలు కొద్ది రోజులలోనే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలను థియేటర్లలో చూసినా కూడా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తూ ఉంటుంది. అటువంటి సినిమాలను ఇంట్లోనే ఓటిటి ప్లాట్ ఫామ్ లో సరదాగా ఫ్యామిలీతో కలిసి చూడండి. ఆ ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీస్ ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం.
బర్ఫీ (Barfi)
ఇద్దరి మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమను ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఈ మూవీలో రణబీర్, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా తమ నటనతో అద్భుతంగా మెప్పించారు. పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్న వ్యక్తిగా రణబీర్ నటన మాటలలో చెప్పలేనిది. మానసిక వికలాంగురాలిగా ప్రియాంక చోప్రా నటన వర్ణించలేనిది. వీరిద్దరూ ఈ సినిమాకి తమ నటనతో జీవం పోశారు. ఇన్ని సమస్యలున్న వీరు జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లారు అనే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రిమింగ్ అవుతోంది.
లైఫ్ ఇన్ ఏ మెట్రో (Life in a… Metro)
ముంబైలో నివసిస్తూ మెట్రోలో పరుగులు పెడుతున్న మనుషుల కథలను ఈ మూవీలో చక్కగా చూపించాడు దర్శకుడు. ఆ బిజీ లైఫ్ లో ప్రేమ ఎలా ఉంటుందో, ఎవరి మీద పుడుతుందో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ మూవీలో ధర్మేంద్ర, కంగనా రనౌత్, ఇర్ఫాన్ ఖాన్, శిల్పా శెట్టి ప్రధాన పాత్రధారులుగా వారి నటనతో మెప్పించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
వేక్ అప్ సిద్ (Wake Up Sid)
రణబీర్, కొంకనసేన్ ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీలో నటించారు. పని పాట లేకుండా తిరిగే హీరోకి, బాధ్యతగల హీరోయిన్ పరిచయమవుతుంది. లైఫ్ ఎలా ఉంటుందో, బాధ్యత ఎలా ఉంటుందో హీరోయిన్ ద్వారా తెలుసుకుంటాడు హీరో. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
డియర్ జిందగీ (Dear Zindagi)
ఈ మూవీ ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. షారుక్ ఖాన్, అలియా భట్ నటించిన ఈ మూవీ, మూవీలవర్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. ఫోటోగ్రాఫర్ గా ప్రొఫెషన్ ఎంచుకున్న అలియా భట్ ఒకానొక దశలో డిప్రెషన్ కి వెళ్ళిపోతుంది. డాక్టర్ గా ఉన్న షారుఖ్ ఖాన్ మళ్లీ ఆమెను మామూలు మనిషిగా, ఎలా చేయగలిగాడనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
దిల్ దడక్నే దో (Dil Dhdakne Do)
ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. కుటుంబ బంధాల గురించి బాధ్యతలు గురించి ఈ మూవీలో చక్కగా ప్రజెంట్ చేశారు. ఒక ఫంక్షన్ లో వీరి కుటుంబ బంధాలు బలపడతాయి. అలా ఈ మూవీ స్టోరీ నడుస్తూ ఉంటుంది. అనిల్ కపూర్, ప్రియాంక చోప్రా, రన్వీర్ సింగ్ నటించిన ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.