BigTV English
Advertisement

Kanguva OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య మూవీ.. ఎందులో స్ట్రీమింగంటే?

Kanguva OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య మూవీ.. ఎందులో స్ట్రీమింగంటే?

Kanguva OTT: ఇటీవల తెలుగుతో పాటు అన్ని భాషల్లో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటే మరి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతున్నాయి. కొలీవుడ్ లో రీసెంట్ గా భారీ బడ్జెట్ తో వచ్చిన పాన్ ఇండియా మూవీగా తమిళ హీరో సూర్య నటించిన కంగువ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన భారీ యాక్షన్ మూవీ మొదటి షోతోనే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఎప్పుడు వచ్చి పోయిందో తెలియకుండా పోయింది. థియేటర్లలో హిట్ టాక్ ను సొంతం చేసుకోలేని ఈ మూవీ ఓటీటీ లోకి రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఏ ఓటీటిలో స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..


కొలీవుడ్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన యాక్షన్ మూవీ కంగువ రూ. 400 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.. కోట్లు పెట్టిన స్టోరీ దెబ్బయ్యడంతో తమిళ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా మిగిలింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. థియేటర్స్ లో ప్లాప్ కావండంతో అనుకున్న టైమ్ కంటే ముందుకు ఓటీటీ రిలీజ్ చేస్తుంది అమెజాన్. కంగువ ను డిసెంబరు 8 న అనగా ఈ రోజే నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తోంది. ఇది థియేటర్ రిలీజ్ అయ్యాక సౌండింగ్, రన్ టైమ్ పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అందుకే ఎక్కువ రోజులు ఆడలేకపోయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోపి చంద్ తో ‘శౌర్యం’, రవితేజతో ‘దరువు’ తో పాటుగా పలు చిత్రాలతో దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్న శివ.. తమిళంలోనూ అజిత్ హీరోగా పలు సినిమాలు తీశాడు. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో అతడిని నమ్మి ‘కంగువ’ సినిమా చేశాడు సూర్య. కానీ కష్టపడ్డప్పటికీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కనీసం సగం బడ్జెట్ కూడా రాలేదని టాక్ వినిపిస్తుంది. ఈ కంగువ నవంబర్ 14న థియేటర్లలో రిలీజైతే.. నెల కూడా కాకుండానే డిసెంబరు 8న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ‘కంగువ’ వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వెరన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే మరీ మూడు వారాలకే ఇలా డిజిటల్‌గా అందుబాటులోకి రావడం విశేషం.. థియేటర్లో జనాలను ఆకట్టుకొని ఈ మూవీ కనీసం ఓటీటీలో అయిన మంచి వ్యూస్ ను అందుకుంటుందేమో చూడాలి.. ఈ సినిమా ఓటీటీ లో హిట్ టాక్ ను అందుకుంటే కొంతవరకైన నిర్మాతలకు ఊరట కలుగుతుంది. ఇక సూర్య ఈ మూవీ ఎఫెక్ట్ తో ఇప్పటిలో సినిమాలు చేసేలా కనిపించలేదు. తదుపరి సినిమాలను అనౌన్స్ చెయ్యలేదు.


Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×