
Kasargold: ఆసిఫ్ అలీ, సన్నీ వేన్, వినాయకన్ ముఖ్య పాత్రల్లో, మృదుల్ నాయర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కాసర్ గోల్డ్’. సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ మలయాళం సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 13 నుంచి ప్రసారం అవుతోంది.
కథ..
ఇద్దరు యువకులు ఫైజల్, అల్బీ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతుంటారు. అయితే, సీఐ అలెక్స్ వీరి కోసం వెతుకుతుంటాడు. మినిస్టర్ మూసాకి నమ్మిన బంటు అల్బీ.. దాంతో అతను బంగారం స్మగ్లింగ్ చేయడానికి సహాయం చేస్తుంటాడు. అల్బీ, ఫైజల్‌తో చేతులు గలిపి ఆ బంగారాన్ని అమ్మాలనుకుంటాడు. మరి మూసాకి తెలియకుండా అల్బీ బంగారాన్ని అమ్మగలిగాడా? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఒక రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ చేయాలనుకున్న బంగారం చోరీ కావడం.. ఫైజల్ అనే గ్యాంగే ఈ పని చేసిందని అనుచరులు వెంటపడటం, మధ్యలో వినాయకన్ సహాయం తీసుకోవడం.. ఇలా ఎన్నో ట్విస్టులతో సాగుతుందీ సినిమా. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్, అక్కడక్కడా లవ్, రొమాన్స్.. ఇలా అన్నీ అంశాలు కాసర్ గోల్డ్ సినిమాలో ఉన్నాయి.