Suriya 45: తమిళ స్టార్ హీరో సూర్య సినిమాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంది. తమిళ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. అందుకే తెలుగులో కూడా సూర్యకు ఫ్యాన్స్ ఉన్నారు. గత ఏడాది కంగువ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది.. ప్రస్తుతం రెట్రో మూవీలో నటిస్తున్నాడు. దాంతో పాటుగా మరో మూవీని లైన్లో పెట్టాడు. తాజాగా తన 45 వ సినిమాను అనౌన్స్ చేశారు.. ఆ మూవీలో సూర్య డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు.. ఆ మూవీ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హీరో సూర్య ఆర్జె బాలాజీ దర్శకత్వంలో ఒక ఫాంటసీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే.. నయనతారతో అభిప్రాయ భేదాలు రావడంతో సూర్యకు ఆ కథను వినిపించి ఒకే చేయించుకున్నాడు. కంగువ తర్వాత కొత్త కథల పై దృష్టి పెట్టాడు. సూర్య 45 స్టోరీ బ్యాక్ డ్రాప్ పదేళ్ల క్రితం వచ్చిన వెంకటేష్ పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’కు దగ్గరగా ఉంటుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇది బాలీవుడ్ హిట్ మూవీ ఓ మై గాడ్ రీమేకనేది విదితమే. ఇప్పుడు సూర్య చేస్తున్న సినిమాలో డ్యూయల్ రోల్ ఉంటుందట. ఒకటేమో దేవుడు. రెండోది లాయర్. దైవం అనుకోని పరిస్థితుల్లో భూమి మీదకు వచ్చినప్పుడు అతని తరఫున వాదించే బాధ్యత ఓ న్యాయవాది మీద పడుతుంది..
ఆ న్యాయవాది ఎలా వాదించి గెలుస్తాడు అన్నది సినిమా స్టోరీ గా ఉంటుందని టాక్.. ఈ సినిమాకు భారీ బడ్జెట్ ని పెట్టబోతున్నారంటూ ఓ వార్త అయితే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ స్టోరీ గురించి అధికారక ప్రకటన రాకపోయినప్పటికీ దాదాపు అదే ఫిక్స్ అయినట్లు ఫిలింనగర్ లో టాక్.. అయితే అటు నయనతార అమ్మోరు తల్లి 2 కూడా దాదాపు ఇదే స్టోరీగా ఉంటుంది.. దేవుడికి మనుషులకి మధ్య జరిగే సంభాషణతో మూవీ ఉంటుంది. యముడు భూలోకంకు వచ్చి నాటకీయతను సృష్టించడం చాలాసార్లు చూశాం. అయితే దేవుడు వచ్చి ఫుల్ లెన్త్ సినిమాని నడిపించడం అప్పుడెప్పుడో రావుగోపాల్ రావు మా ఊళ్ళో మహాశివుడుతో మొదలైంది. ఆ తర్వాత వెంకటేష్ నటించిన గోపాల గోపాల సినిమాలో ఈ తరహా కథతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం సూర్య బెట్రో మూవీ సినిమాలో బిజీగా ఉన్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వలో మూవీ తెకెక్కుతుంది. ఆ సినిమాని త్వరగా పూర్తిచేసి తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట.. వచ్చే ఏడాది సూర్య నుంచి రెండు సినిమాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం వచ్చినా కంగువా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.. మరి ఈ సినిమాలు ఎలాంటి విజయాల్ని సొంతం చేసుకుంటాయో చూడాలి..