Susmita Konedela:మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్నా సరే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలకి పోటీ ఇస్తూ కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇస్తూ బిజీగా దూసుకుపోతున్నారు..ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)కాంబినేషన్లో మెగా 157 చిత్రం ఉగాది పండుగ సందర్భంగా.. నేడు చాలా గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. విక్టరీ వెంకటేష్ (Venkatesh) అతిథిగా హాజరై ముహూర్తపు షాట్ పై క్లాప్ ఇవ్వగా.. సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అభిమానులలో గందరగోళం..
ఇకపోతే అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో వస్తున్న చిత్రాన్ని చిరు 157 చిత్రంగా అనౌన్స్ చేయడంతో గందరగోళం ఏర్పడింది. అసలు విషయంలోకి వెళ్తే. గతంలో విశ్వంభర సినిమాను మెగా 157 అని అనౌన్స్ చేయగా .. టైటిల్ రిలీజ్ అయ్యాక విశ్వంభర పేరుతోనే వైరల్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడుతూ వస్తోంది. మొదట సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. కానీ అప్పుడు షూటింగ్ పూర్తి కాలేదని వాయిదా వేశారు. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అంటున్నారు. కనీసం ఇప్పుడైనా సినిమా విడుదలవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. అంతలోనే అనిల్ రావిపూడి మెగా 157 సంక్రాంతికి వస్తున్నాం అంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అభిమానులలో గందరగోళం నెలకొనింది. మరి మెగాస్టార్ 156 సినిమా ఏమయింది? దాని సంగతేంటి? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సుస్మిత.. మెగాస్టార్ 156 మూవీ ఆగిపోయినట్టేనా.
అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల(Susmita Konedela)నిర్మాణంలో మెగాస్టార్ 156 సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అంతలోనే అనిల్ రావిపూడి మూవీకి 157 అని ప్రకటించడంతో మధ్యలో విశ్వంభర మూవీని 156గా మార్చేసినట్లు తెలుస్తోంది. దీంతో సుస్మిత కొణిదెల నిర్మాణంలో రాబోయే మెగాస్టార్ 156 మూవీ ఆగిపోయినట్లే అని తెలుస్తోంది .ఏది ఏమైనా సుస్మిత కొణిదెల నిర్మాణంలో రావాల్సిన ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది.? అసలు ఆ సినిమా దర్శకుడు ఎవరు? కథ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
చిరంజీవి కెరియర్..
ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్టు లేకుండా అడుగుపెట్టి సుప్రీం స్టార్ గా ఆ తర్వాత మెగాస్టార్ గా మారి నేడు భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయరంగం వైపు కూడా అడుగులు వేసిన ఈయన అలా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేశారు. కానీ కుదరలేదు. దీంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసి కొంతకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రాజకీయ భవిష్యత్తుకు దూరంగా ఉంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అందులో భాగంగానే వరుస పెట్టి యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి. ఇక విశ్వంభర, మెగాస్టార్ 157 చిత్రాలతో చిరంజీవికి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి.