BigTV English

Salman Khan: ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే తన గురించి తెలుసుకున్నాను.. రష్మికపై సల్మాన్ ఖాన్ కామెంట్స్

Salman Khan: ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే తన గురించి తెలుసుకున్నాను.. రష్మికపై సల్మాన్ ఖాన్ కామెంట్స్

Salman Khan: చాలావరకు బాలీవుడ్‌లో ఉండే స్టార్ హీరోలకు సౌత్‌లో హీరోయిన్స్ గురించి పెద్దగా తెలియదు. సౌత్ హీరోయిన్లు బాలీవుడ్‌లోకి డెబ్యూ ఇచ్చిన తర్వాతే వారి గురించి తెలుస్తుంది. అలాగే రష్మిక మందనా సౌత్‌లో ఎంత పెద్ద స్టార్ అయినా.. బాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చేవరకు తన గురించి కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియదు. అదే విధంగా తనకు కూడా తెలియదని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్, రష్మిక మందనా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటించిన ‘సికందర్’ (Sikandar) సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ మూవీని తెగ ప్రమోట్ చేస్తున్నాడు సల్మాన్. ఆ ప్రమోషన్స్‌లో భాగంగా అసలు రష్మిక తనకు ఇన్‌స్టాగ్రామ్ వల్లే తెలుసని రివీల్ చేశాడు.


రీల్స్‌లోనే చూసింది

ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమాలకు సంబంధించిన రీల్స్ తరచుగా వస్తూనే ఉంటాయి. అలా రీల్స్‌లోనే రష్మిక మందనాను చూశానని బయటపెట్టారు సల్మాన్ ఖాన్. అలా కొన్నాళ్ల పాటు తనను రీల్స్‌లోనే చూశాడట. అదే సమయంలో సల్మాన్ ఖాన్ వారసుడు ఆయుష్ శర్మ హీరోగా బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యాడు. బీ టౌన్‌లో స్టార్ అయిన తర్వాత తన తరువాతి తారంలో హీరోగా పరిచయం చేయడానికి తన బావను సెలక్ట్ చేసుకున్నాడు. అలా ‘లవ్‌యాత్రి’ అనే సినిమాతో తన బావ ఆయుష్ శర్మను రంగంలోకి దించాడు. ఆ తర్వాత 2018లో ‘అంతిమ్’ అనే సినిమాలో నటించాడు. అదే సమయంలో రీల్స్‌లో రష్మికను చూసి ‘అంతిమ్’లో హీరోయిన్‌గా ఎంపిక చేయాలని చెప్పాడట రష్మిక.


హీరోయిన్ ఛేంజ్

2018లో ‘అంతిమ్’ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ ఎవరు అని డిస్కషన్ వచ్చినప్పుడు రష్మిక రీల్‌ను చూపించి తనను హీరోయిన్‌గా ఎంపిక చేయమని ఆయుష్ శర్మ‌కు చెప్పాడట సల్మాన్ ఖాన్. ఆ రీల్ చూపించగానే తను సౌత్‌లో పెద్ద స్టార్ అని సల్మాన్‌కు చెప్పాడట ఆయుష్. అలా తనను ఈ సినిమా కోసం కనీసం సంప్రదించకుండా ఆగిపోయారట మేకర్స్. మహేశ్ మంజ్రేకర్ డైరెక్ట్ చేసిన ‘అంతిమ్’లో ఆయుష్మ శర్మకు జోడీగా మహిమా మక్వానా నటించింది. మరొక కీలక పాత్రలో సల్మాన్ ఖాన్ కూడా నటించాడు. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సల్మాన్ ఖానే స్వయంగా నిర్మించాడు. అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిశాస్టర్ అయ్యింది.

Also Read: కాస్ట్‌లీ కారు కొన్న సాహో బ్యూటీ.. ఎన్ని కోట్లు తెలిస్తే షాక్ అవుతారు..

కెరీర్ ఎండ్

సల్మాన్ ఖాన్ (Salman Khan) వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఆయుష్ శర్మ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదుర్కోవడంతో తన కెరీర్ దాదాపుగా ఎండ్ అయిపోయింది. ఇప్పటికీ తనకు హీరోగా అవకాశాలు రావడం లేదు. ఇక సల్మాన్ ఖాన్ విషయానికొస్తే.. తను నటించిన గత కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ‘సికిందర్’ హిట్ అవ్వాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘సికందర్’ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలావరకు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలే వస్తున్నా.. మరికొందరు మాత్రం ఇది రొటీన్ స్టోరీ అని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఫస్ట్ షో పూర్తవ్వక ముందే అప్పుడే ‘సికందర్’ హెచ్‌డీ ప్రింట్ పైరసీలో వచ్చేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×