Swapnaala Naava: కలలు కనాలి.. వాటిని నెరవేర్చుకోవాలి అని చాలా మంది అనుకుంటారు. అయితే కొందరు మాత్రం ఆ కలలను నిజం చెయ్యాలని సాయశక్తులా ప్రయత్నిస్తారు. కోరికతో పాటుగా పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదని చాలా మంది నిరూపిస్తున్నారు.. స్టాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. డల్లాస్‌లో స్థిరపడిన తెలుగు వ్యక్తి గోపీ కృష్ణ కొటారు శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు. తన కుమార్తె శ్రీజ కొటారు స్వయంగా ఆలపించి.. నటించిన ‘స్వప్నాల నావ’ అంటూ సాగే సాంగ్ వీడియో షూటింగ్‌ను మొదటి ప్రయత్నంగా ప్రారంభించారు. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఈ పాటను అంకితం చేయనున్నారు. ఓఎమ్‌జీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ మీనాక్షి అనిపిండి సమర్పిస్తున్నారు.. అయితే ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. మిలియన్ వ్యూస్ ను అందుకోవడం విశేషం..
టాలీవుడ్ గేయ రచయితగా ఎన్నో వందల సినిమాలకు సిరివెన్నెల సీతారమ శాస్త్రి అద్భుతమైన పాటలను అందించారు. ఆయన కాలంలో ఏదో మ్యాజిక్ ఉంది. అందుకే ఆ పాటలు ఎంతో అర్ధవంతంగా, సంగీత ప్రియులను ఆకట్టుకుంటాయి. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఓ పాటను అంకితం చేశారు. మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు డా. వి.ఎన్.ఆదిత్య లేటెస్ట్ గా ‘స్వప్నాల నావ’ అనే యూట్యూబ్ మ్యూజిక్ వీడియో రూపొందించారు. డల్లాస్ కి చెందిన ప్రవాసాంధ్రుడు, ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినటువంటి శ్రీ గోపీకృష్ణ కొటారు గారు ‘శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘స్వప్నాల నావ’ మ్యూజిక్ వీడియోని నిర్మించారు. నిర్మాత గోపికృష్ణ కుమార్తె శ్రీజ కొటారు ఈ పాటను ఆలపించడమే కాకుండా నటించడం కూడా విశేషం..
Also Read : సిక్స్ ప్యాక్‌తో చిరంజీవి.. ఏం ఉన్నాడు రా బాబు..!
ఈ ‘స్వప్నాల నావ’ థీమ్ విషయానికి వస్తే, చదువులో ఒకసారి ఫెయిలయిన విద్యార్థినీ విద్యార్థులను మోటివేట్ చేసే పాట ఇది.. దివంగత స్టార్ లిరిసిస్ట్ అయినటువంటి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దివ్య స్మృతికి అంకితంగా దీనిని మలిచారు . ప్రముఖ గాయకుడు,సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని సంగీత దర్శకత్వంలో యశ్వంత్ ఆలూరు ఈ పాటకి సాహిత్యం సమకూర్చారు. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అంటే దర్శకులు డా. వీ.ఎన్.ఆదిత్య , నిర్మాత గోపీ, సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని, గీతరచయిత యశ్వంత్ ఆలూరు గారికి ఎంతో అభిమానం. వీ.ఎన్.ఆదిత్య సూపర్ హిట్ సినిమా ‘మనసంతా నువ్వే’ లో కూడా సిరివెన్నెల సింగిల్ కార్డ్ పాటలు రాయడమే కాకుండా, ఈనాటికీ గుర్తుండిపోయే ఓ మంచి పాత్రని కూడా చేశారు. ఇప్పుడు ‘స్వప్నాల నావ’ తో సిరివెన్నెల గారి గొప్పతనాన్ని, ఆయనపై ఉన్న అభిమానాన్ని గొప్పగా చాటి చెప్పారు ఈ టీమ్. అందుకే ప్రేక్షకుల నుండి ‘స్వప్నాల నావ’ కి విశేషాదరణ లభిస్తోంది. తాజాగా శ్రీక్రియేటివ్స్ యూ.ఎస్.ఏ. యూట్యూబ్ ఛానల్ లో రిలీజైన ఈ పాటకు 1 మిలియన్ వీక్షణలు ( పది లక్షల వ్యూస్ ) నమోదయ్యాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ వీక్షకులకి, మీడియా వారికి, కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘స్వప్నాల నావ’ ని వీక్షించిన వాళ్లలో చాలా మంది ప్రేక్షకులు టాలీవుడ్ గర్వించదగ్గ దిగ్గజ రైటర్ కమ్ లిరిసిస్ట్ అయినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి డా.వీ.ఎన్.ఆదిత్య గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చారు అంటూ ఆయన్ని అభినందిస్తున్నారు..