Megastar Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలబడి ఇప్పుడు ఈ స్థాయిలో స్టార్ ఇమేజ్ ని అందుకున్నాడు.. అంతేకాదు వయసు శరీరానికే కానీ మనసుకు కాదు అంటూ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. గత కొన్నేళ్లుగా చిరంజీవికి హిట్ సినిమాలు పడలేదు. ఈమధ్య కథల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహారిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ ( Vasista ) తో విశ్వంభర ( Viswambhara) సినిమాలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా మెగాస్టార్ సిక్స్ ప్యాక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో చిరును చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.. నిజానికి అది రియల్ కాదు.. మరేంటి అనుకుంటున్నారా? ఆ వీడియో గురించి వివరంగా తెలుసుకుందాం…
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఏఐ లో క్రియేట్ చేసింది. అందులో మెగాస్టార్ కాస్త స్లిమ్ గానే కాదు.. యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే ఆ వీడియోలో శ్రీదేవి ( sridevi) కూడా కనిపిస్తుంది. చిరు లుక్, సిక్స్ ఫ్యాక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో లైకులు, షేర్లు చేస్తున్నారు. అది చూసిన మెగా ఫ్యాన్స్ చిరు సిక్స్ ఫ్యాక్స్ అదిరింది మామా అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. దాంతో వీడియో పోస్ట్ అయిన కొద్దిసేపటికే వైరల్ అవ్వడం విశేషం.. ఆ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకోండి..
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Also Read : మాస్టర్ వెనుక అతి పెద్ద కుట్ర.. శ్రేష్ఠ వర్మ ఫైనల్ గా కోరుకునేది ఇదేనా..?
ఇక చిరు ఖాతాలో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతగా హిట్ సినిమాలు పలకరించలేదు. హీరో అన్న తర్వాత సక్సెస్ తో పాటు ఫ్లాప్ లను కూడా చవిచూడాల్సి వస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. అలాంటి సినిమాలు చిరంజీవి ఖాతాలో కూడా కొన్ని ఉన్నాయి.. ఈ మధ్య సరైన హిట్ సినిమా పడలేదు.. ప్రస్తుతం విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీలో యంగ్ లుక్ లో కనిపించునున్నారని టాక్. దానికి కోసం చిరు లుక్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. భోళా శంకర్ ప్లాప్ తర్వాత రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాల ఉన్నాయి. మరి మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
ఇక ఈ మూవీ తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఓ సినిమాకి ప్రకటన వచ్చేసింది. దీని కన్నా ముందు డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలు వెలువడనున్నాయి..