Will Young Century: ఛాంపియన్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే కివీస్ ఓపెనర్ విల్ యంగ్, టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. ఛాంఫీయన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్- పాకిస్థాన్ మధ్య ఇవాళ తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది.
న్యూజిలాండ్ టీమ్: డేవన్ కాన్వే, విల్‌యంగ్, కేన్, డారిల్, టామ్ లేథమ్,బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియమ్ రౌర్కీ
పాకిస్థాన్ టీమ్: జమాన్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, రిజ్వాన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
ALSO READ: Group-D Jobs: పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్..
మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ మంచి స్కోర్ దిశగా వెళ్తోంది. ఓపెనర్ విల్ యంగ్ సెంచరీతో దుమ్ములేపాడు. విల్ యంగ్ 107 బంతుల్లో ఒక సిక్స్, 11 ఫోర్ల సాయంతో సెంచరీ చేశారు. విల్ యంగ్ కు మొదటి నుంచే చక్కగా ఆడాడు. అతడు సెంచరీ చేసే సమయానికి డెవన్ కాన్వే 10, కేన్ విలియంసన్ 1, డారెల్ మిచెల్ 10 రన్స్ చేశారు. టామ్ లాథమ్ భాగస్వామ్యంతో విల్ యంగ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. విల్ యంగ్ సెంచరీ చేసే సమయానికి న్యూజిలాండ్ స్కోర్ 175 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో నసీం షా, అబ్రర్ అహ్మద్, హ్యారీ రౌఫ్ కు తలో వికెట్ చేశారు.
అయితే, ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు పాక్ వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో విల్ యంగ్ పెద్దగా రాణించలేదు. ఈ సిరీస్‌లో యంగ్ మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. విల్ యంగ్ ను ఎందుకు ఎంపిక చేశారని పలువురు కామెంట్ చేశారు. కానీ విల్ యంగ్ ఇవాళ సెంచరీ చేసి బ్యాట్ తో సమాధానం ఇచ్చాడు.
టామ్ లాథమ్ కూడా సెంచరీ..
మరోవైపు టామ్ లాథమ్ కూడా సెంచరీ చేశారు. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో టామ్ లాథమ్ సత్తాచాటాడు.
ఇక తొలి మ్యాచ్ లోనే సెంచరీతో మెరిసిన యంగ్, టామ్ లాథమ్ ఇద్దరు ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన నాలుగో కివీస్ ఆటగాడిగా నిలిచాడు. టామ్ లాథమ్ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన ఐదో కివీస్ ఆటగాడిగా నిలిచాడు. 47 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోర్ 283 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.
ALSO READ: Jobs in Supreme Court: డిగ్రీ అర్హతతో కోర్టులో 241 ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేసిన కివీస్ ప్లేయర్లు వీరే..
145* – నాథన్ ఆస్టిల్ vs అమెరికా, ది ఓవల్, 2004
102* – క్రిస్ కెయిర్న్స్ vsభారత, నైరోబి, 2000 ఫైనల్
100 – కేన్ విలియమ్సన్ vs ఆస్ట్రేలియా, ఎడ్జ్‌బాస్టన్, 2017
107 – విల్ యంగ్ vs పాకిస్తాన్, కరాచీ, 2025
118*- టామ్ లాథమ్ వర్సెస్ పాకిస్థాన్ కరాచీ, 2025