BigTV English
Advertisement

Swapnala Naava: కొత్త ప్రయోగం.. వారికే అంకితం.. వీఎన్ ఆదిత్య కామెంట్స్..

Swapnala Naava: కొత్త ప్రయోగం.. వారికే అంకితం.. వీఎన్ ఆదిత్య కామెంట్స్..

Swapnala Naava: ప్రస్తుత కాలంలో చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మరో కొత్త టాలెంట్ ఇండస్ట్రీలోకి రాబోతోంది. అసలు విషయంలోకెళితే, డల్లాస్ లో స్థిరపడిన ఒక తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన గోపికృష్ణ కొటారు(Gopikrishna kotar).. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మొదటి ప్రయత్నంగా తన కుమార్తె శ్రీజ కొటారు (Sreeja Kotaru) పాడి నటించిన “స్వప్నాల నావ”వీడియో చిత్రీకరణను ప్రారంభించడం జరిగింది.


దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం చేస్తూ రూపొందిస్తున్న ఈ పాటని ఓఎంజి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ పాటకు పార్థసారధి నేమాని స్వరాలు సమకూర్చారు. యశ్వంత్ సాహిత్యం అందించారు. ప్రముఖ దర్శకుడు వీ.ఎన్. ఆదిత్య(V.N. Adithya) చిత్రీకరణ చేయడం జరిగింది.

అలాగే ఈ వీడియో కి బుజ్జి కె. సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో ఈ పాట పూర్తి చిత్రీకరణ చేయడం జరిగింది. స్వప్నాల నావ పాట పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన వీడియో లాంచ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని, కుమారి శ్రీజ కొటారు, నిర్మాత గోపికృష్ణ కొటారును అభినందించడం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన భావజాలం ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందని నిర్మాత గోపికృష్ణ తెలిపారు. నేడు ఆయనే ఉండి ఉంటే, నేటి యువతరానికి ఆయన సాహిత్యం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తారన్న ఆలోచనలో నుంచే ఈ స్వప్నాల నావ పాట చేయాలనే ఆలోచన మాలో కలిగిందని ఆయన తెలిపారు.


అలాగే పార్థసారధి నేమాని మాట్లాడుతూ..”ఈ మధ్యకాలంలో యువత ధైర్యం కోల్పోతున్నారు. ప్రతి చిన్న విషయానికి నిరాశకు లోనవుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శాస్త్రి లాంటి గొప్ప వ్యక్తి ఇచ్చిన సాహిత్యాన్ని ప్రేరణగా తీసుకొని, పిల్లల కోసం ఈ పాటను చేశాము. ఈ పాటను ఆలపించిన శ్రీజ కి ప్రొఫెషనల్ సింగర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. ఎన్నో పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించిన వీ.ఎన్.ఆదిత్య ఈ పాటకు దర్శకత్వం వహించడం మా అదృష్టం” అని కూడా పార్థసారథి తెలిపారు.

ఇక అలాగే డైరెక్టర్ వీ.ఎన్.ఆదిత్య కూడా మాట్లాడుతూ .. ఒక మనిషి ఎన్నిసార్లు కింద పడితే, అంతగా పైకి వస్తాడు. గోపికృష్ణ కూడా అంతే. కొత్తగా ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన జర్నీ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నాము. శ్రీజ ప్రతిభ, గాత్రం చూస్తే ప్రొఫెషనల్ సింగర్ అనిపించింది. కానీ అప్పుడే అరంగేట్రం చేసిన యువతిలా ఆమె కనిపించలేద. స్వప్నాలనావ పాటను వీలైనంత త్వరగా చిత్రీకరణ చేసి మీ ముందుకు తీసుకొస్తాము” అంటూ ఆయన తెలిపారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×