BigTV English
Advertisement

Upendra UI Movie OTT: ఉపేంద్ర యాక్షన్ మూవీకి ఓటీటి ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Upendra UI Movie OTT: ఉపేంద్ర యాక్షన్ మూవీకి ఓటీటి ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Upendra UI Movie OTT: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు చెయ్యాల్సిన అవసరం లేదు తెలుగులో కూడా ఆయన సినిమా ఉన్నాయి. విలన్ గా ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇక ఉపేంద్ర పాత్రలో నటించిన మూవీ యూఐ.. భారీ యాక్షన్ సన్నివేశాలతో వచ్చిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ లో థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. విడుదలకు ముందు మంచి టాక్ ను సొంతం చేసుకున్న మూవీ భారీ అంచనాలతో వచ్చి యావరేజ్ టాక్ అందుకుంది. అయితే ఈ మూవీ ఓటీటి పార్ట్నర్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలకు చిత్ర యూనిట్ చెక్ పెట్టింది.. ఓటీటీ ప్లాట్ ఫామ్ గురించి వచ్చే వార్తలకు చెక్ పెట్టింది.


UI మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

సత్య అనే వ్యక్తి మంచితనంతో అందర్నీ మార్చాలని జాతి మత కుల బేధాలు లేని సమాజం నిర్మించాలని అనుకుంటాడు. మరో వైపు కల్కి తన తల్లిని నాశనం చేసిన ఈ సమాజంపై కక్ష కట్టి మనుషులందరినీ బానిసలుగా చేయాలని చూస్తూ ఉంటాడు. ఓ ఘటనలో సత్యని బంధించి కల్కి బయట సమాజాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి కల్కి సమాజాన్ని ఎలా మార్చాడు? సత్య తప్పించుకొని బయటకు వచ్చాడా? అసలు బయట సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు? అనేది స్టోరీ ఈ మొత్తానికి ఏదో గందరగోళంగా మారింది. దాంతో సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు.. ఇక దర్శకుడిగా కొత్త కొత్త సినిమాలను అందించిన ఉపేంద్ర చాన్నాళ్ల తర్వాత మళ్ళీ నటుడిగా, దర్శకుడిగా యూఐ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉపేంద్ర మెయిన్ లీడ్ లో తన సొంత దర్శకత్వంలోనే ఈ యూఐ సినిమా తెరకెక్కింది. రేష్మ నానయ్య, మురళి శర్మ, రవి శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు…


ఓటీటీ డీటెయిల్స్.. 

ఈ మూవీ డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైంది. మరో డిస్టోపియన్ ఫ్యూచర్ యాక్షన్ మూవీగా వచ్చిన యూఐకి థియేటర్లలో జనాలను మెప్పించలేకుండా పోయింది.. ఈ సినిమా ఓటీటీ హక్కులను సన్ నెక్ట్స్ సొంతం చేసుకుందని వస్తున్న వార్తలు ఆ మూవీ టీమ్ బుధవారం ఖండించింది.. స్ట్రీమింగ్, టీవీ పార్ట్‌నర్ ఎవరన్నది మూవీ టైటిల్స్ సమయంలో వేయలేదు. దీంతో సన్ నెక్ట్స్ కే దక్కినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదంటూ తమ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. అందుతున్న సమాచారం ప్రకారం.. కన్నడ చిత్రాలను ఎక్కువగా అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేస్తుంది. మరి ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా త్వరలోనే ఓటీటీ పార్ట్నర్ ను అనౌన్స్ చెయ్యనున్నారు. ఉపేంద్ర చేసిన సినిమాలకు ఈ మూవీ మ్యాచ్ చెయ్యలేక పోయింది..

Tags

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×