BigTV English

Taapsee Pannu: ఏడు నిమిషాల పాత్ర.. జీవితాన్నే మార్చేసిందంటున్న తాప్సీ..

Taapsee Pannu: ఏడు నిమిషాల పాత్ర.. జీవితాన్నే మార్చేసిందంటున్న తాప్సీ..

Taapsee Pannu: ఒక్కొక్కసారి హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసే పాత్రలు కూడా ప్రేక్షకులపై తీవ్రమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. గెస్ట్ రోల్స్ లాంటివి కూడా చాలాకాలం పాటు అందరికీ గుర్తుండిపోతాయి. అలాగే తను చేసిన ఒక గెస్ట్ రోల్ తనకు బాగా గుర్తుండిపోతుందని తాజాగా బయటపెట్టింది తాప్సీ పన్ను (Taapsee Pannu). టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లిన తాప్సీ.. చాలావరకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది. వాటి వల్లే తను బాలీవుడ్‌లో స్టార్ అయిపోయింది. అంతే కాకుండా తనకు నచ్చింది నచ్చినట్టుగా మాట్లాడే మనస్థత్వంలో చాలామందికి దగ్గరయిన తాప్సీ.. తన కెరీర్‌లోని స్పెషల్ రోల్ గురించి తాజాగా బయటపెట్టింది.


కెరీర్‌పై ఇంపాక్ట్

బాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన కొత్తలో కొన్నాళ్ల పాటు కమర్షియల్, యూత్ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది తాప్సీ పన్ను. కానీ ఆ తర్వాత మాత్రం పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు షిఫ్ట్ అయిపోయింది. వాటితోనే తనకు సక్సెస్ కూడా లభించింది. దానివల్ల తాప్సీ యాటిట్యూడ్ కూడా చాలా మారిపోయిందని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అప్పటినుండి తను స్టార్ హీరోలతో నటించడానికి రెడీ లేనని, వారి సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదని ఓపెన్‌గానే కామెంట్స్ చేస్తూ వచ్చింది తాప్సీ. అలాంటిది ఒక స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయడం తన కెరీర్‌పై భారీ ఇంపాక్ట్ చూపించిందని బయటపెట్టింది.


అప్పటి జ్ఞాపకాలు

అక్షయ్ కుమార్ హీరోగా 2015లో విడుదలయిన థ్రిల్లర్ చిత్రం ‘బేబి’. ఆ సినిమాలో అక్షయ్‌కు అసిస్టెంట్ పాత్రలో ఏడు నిమిషాల పాటు కనిపించి అలరించింది తాప్సీ. కనిపించింది కాసేపే అయినా అందులో తన నటన ప్రేక్షకులను మాత్రమే కాదు.. మేకర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తనకు బాలీవుడ్‌లో అవకాశాలు పెరగడం మొదలయ్యింది. ఈ సినిమా విడుదలయ్యి పదేళ్లు అవుతుండడంతో మరోసారి ‘బేబి’ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది తాప్సీ. అందులో కనిపించింది కాసేపే అయినా ఆ సినిమాకు ఎప్పటికీ రుణపడిపోతాను అన్నట్టుగా ‘బేబి’ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది.

Also Read: సోషల్ మీడియాలో ఫేక్ ఫోటో వైరల్, స్పందించిన మాళవికా.. మరీ ఇంత దారుణమా.?

మంచిగా మార్చేసింది

‘‘డియర్ యాక్టర్స్.. మీరు ఎన్ని నిమిషాలు స్క్రీన్‌పై కనిపిస్తారు అనేది ముఖ్యం కాదు.. ఆ కొన్ని నిమిషాల్లో మీరు ఎంత ఇంపాక్ట్ చూపిస్తారు అనేది ముఖ్యం. ఆ ఏడు నిమిషాలు నా జీవిత గమనాన్ని మంచివైపు మార్చేశాయి. ప్రేమతో మీ నామ్ షబానా’’ అని ‘బేబి’ (Baby) గురించి చెప్పుకొచ్చింది తాప్సీ. ఆ మూవీలో తను చేసిన నామ్ షబానా పాత్ర సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అదే టైటిల్‌తో తనపై ప్రత్యేకంగా మరొక లేడీ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కించారు మేకర్స్. 2017లో విడుదలయిన ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం తను యాక్షన్ థ్రిల్లర్ ‘గాంధారీ’తో బిజీగా గడిపేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×