BigTV English
Advertisement

Taapsee: కంగనా సోదరిపై మండిపడ్డ తాప్సీ.. అసలేమైందంటే..?

Taapsee: కంగనా సోదరిపై మండిపడ్డ తాప్సీ.. అసలేమైందంటే..?

Taapsee:సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను(Taapsee Pannu) కి ఇండియా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఈమె కొద్దిరోజులు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి, ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో నార్త్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయింది. అలాంటి తాప్సీ పన్ను సౌత్ లో కంటే నార్త్ లోనే గుర్తింపు తెచ్చుకుంది. నార్త్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కథా బలం ఉన్న ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా రాణించింది. అయితే అలాంటి తాప్సీ పన్ను తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా సోదరి రంగోలి రానౌత్ (Rangoli Ranaut)కి కౌంటర్ ఇచ్చింది. మరి ఇంతకీ కంగనా సోదరికి , తాప్సి పన్నుకి మధ్య జరిగిన గొడవ ఏంటి? ఆమెకి తాప్సీ పన్ను ఎందుకు వార్నింగ్ ఇచ్చింది.. ? తాప్సీ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


కంగనా సోదరికి స్ట్రాంగ్ కౌంటర్ వేసిన తాప్సీ..

తాప్సీ పన్ను ప్రస్తుతం గాంధారి, వో లడ్కి హై కహా అనే సినిమాల్లో నటిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ పన్ను గతంలో కంగనా సోదరి రంగోలి తనపై చేసిన కామెంట్లపై కౌంటర్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “కొంతమంది మాట్లాడే మాటలు వారి ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి. మనం మాట్లాడే ఏ మాట అయినా సరే మన వ్యక్తిత్వాన్ని, పెంపకాన్ని బయటపెడతాయి. అయితే నేను గతంలో కంగనా లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ ని కాపీ కొట్టానంటూ మాట్లాడారు. కానీ దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. బహుశా కంగనా లాగా నేను ఎక్కువగా పారితోషికం తీసుకోకపోవడం వల్ల నేను కాపీ కొట్టాను కావచ్చు. ఎక్కడైనా సరే కష్టపడి తన ప్రయాణాన్ని తానే సొంతంగా ఏర్పరచుకున్న ఏ మహిళ గురించి కూడా నేను తప్పుడు మాటలు మాట్లాడను. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది” అంటూ కంగనా రనౌత్ (Kangana Ranaut) సోదరి రంగోలి రనౌత్ కి పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది తాప్సీ.


ఇద్దరి మధ్య కోల్డ్ వార్ అప్పటి నుంచే..!

అయితే రంగోలి తాప్సీకి మధ్య జరిగిన గొడవ ఏంటంటే.. 2019 లో కంగనా రనౌత్ నటించిన “జడ్జిమెంటల్ హై క్యా” అనే సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది.అయితే ఆ టైంలో తాప్సీ పన్ను కంగనా నటించిన ట్రైలర్ ని ప్రశంసించింది.కానీ ఈ ట్వీట్లో తాప్సీ ఎక్కడా కూడా కంగనా రనౌత్ పేరు యాడ్ చేయలేదు. దాంతో తాప్సీ ట్వీట్ పై స్పందించిన కంగనా సోదరి రంగోలి రనౌత్..” కంగనా నటించిన మూవీ ట్రైలర్ ని ప్రశంసించారు. కానీ కంగనా పేరును ప్రస్తావించలేదు. కొంతమంది కంగనాని కాపీ కొడుతూ తమ దుకాణాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఆమెను వారు గుర్తించరు. తాప్సీ గారు మీరు సస్తీ కాపీగా ఉండడం మానేయండి” అంటూ కంగనా సిస్టర్ రంగోలి రనౌత్ తాప్సీని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాకింగ్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ తర్వాత డిలీట్ చేసినప్పటికీ క్షణాల్లోనే అది వైరల్ అవ్వడంతో 2019 నుండి ఇప్పటి వరకు వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక 2019లో రంగోలి చేసిన ట్వీట్ కి తాప్సి తాజాగా కౌంటర్ ఇచ్చింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×