Tamannaah Bhatia Deletes Her Viral Radha Photoshoot After Facing Massive Flak For Hurting Sentiments: దాదాపు రెండు దశాబ్దాలుగా తరగని పాలనురుగులాంటి తన అందంతో మిల్కీ బ్యూటీగా ప్రేక్షకులను మెప్పిస్తోంది తమన్నా భాటియా. తెలుగులో శ్రీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. మంచు మనోజ్ హీరో ఆ మూవీకి. అతి తక్కువ పీరియడ్ లోనే అత్యంత విశేష ఆదరణ చూరగొంది తమన్నా భాటియా. దాదాపు దక్షిణాది భాషలలో నటించిన తమన్నా బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. తమన్నా ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాలలో ఐటం సాంగ్స్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకుంది. జైలర్ మూవీలో రా..నువ్వు కావాలయ్యా పాట ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. సరిలేరు నీకెవ్వరూ మూవీలో పార్టీ సాంగ్ కూడా బాగా హిట్ అయింది. ఇటీవల స్త్రీ-2 బాలీవుడ్ మూవీలో తమన్నా ఐటం సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించింది తమన్నా. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించింది తమన్నా. అయితే తమన్నాకు సమకాలికులు నయనతార, రకూల్,సమంత తదితర కథానాయికలు పెళ్లిళ్లు చేసుకున్నారు. తమన్నా మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతున్నారు.
డేటింగ్ లో ఉన్న తమన్నా
గత కొంత కాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉన్న తమన్నా ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే గతేడాది ఇద్దరూ ఒకటవ్వబోతున్నామని చెప్పిన తమన్నా..ఇటీవల ఓ మీడియా సమావేశంలో తనకు పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదని చెప్పడంతో అందరూ షాక్ కుగురయ్యారు. అయితే అవన్నీ పక్కన పెడితే తమన్నా ఇటీవల శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని రాధ గెటప్ లో ఫోటోషూట్ చేసింది. తన ఇన్ స్టా వేదికగా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ కూడా చేసింది. దానికి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే శృంగారం డోస్ కాస్త ఎక్కువగా చూపించిందని కృష్ణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధ అంటే ఓ పవిత్ర ప్రేమికురాలు. శ్రీకృష్ణుని ఆరాధించే రాధను నార్త్ లో దేవతగా కొలుస్తారు. అటువంటి దేవతను అసభ్యంగా ఇలాంటి ఎక్స్ పోజింగ్ డ్రెస్ లో అందాలను బహిర్గతం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
రాధ గెటప్ దుమారం
ఓ రకంగా రాధను లైంగికానికి గురిచేశావు అంటూ నెటిజనులు మిల్కీ బ్యూటీ తమన్నాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రెస్సులు రూపొందించింది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కరణ్ తోరానీ. ఈ ఫొటో షూట్ తో తమన్నా అసలు రాధ బయటకొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. పలు హిందూ సంఘాలు కూడా తమన్నాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నింటి కన్నా ముఖ్యంగా దాదాపు 170 దేశాలకు విస్తరించిన ఇష్కాన్ భక్తులందరికీ తమన్నా ఆగ్రహం కలిగించింది. అయితే ఆన్ లైన్ లో రచ్చ ఎక్కువయ్యేసరికి తమన్నా, ఫ్యాషన్ డిజైనర్ టోరానీ ఇద్దరూ కలిసి ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తొలగించారు. అయితే ఈ విషయంలో ఇప్పటిదాకా తమన్నా ఎలాంటి ప్రకటనా చేయలేదు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా శ్రీ కృష్ణ భక్తులకు క్షమాపణలు చెబుతుందని అనుకుంటున్నారంతా. సంప్రదాయ దుస్తులలో ఫొటో షూట్ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదని..తమ అభిమాన నటి ఇలా చేస్తుందని ఊహించలేదని ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అవుతున్నారు.