Sharmila On Jagan: ఫ్యామిలీ ఆస్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. సరస్వతి పవర్ షేర్లను తల్లి విజయమ్మకు జగన్ గిఫ్ట్‌డీడ్ కింద ఇచ్చారని, వాటిని మళ్లీ తనకే కావాలని కోర్టుకు వెళ్లారన్నారు. స్వయంగా తల్లినే జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు.
తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో జగన్ మిగిలిపోతారని రుసరుసలాడారు. జగన్‌కు విశ్వసనీయత ఉందో లేదో వైసీపీ నేతలు ఒక్కసారి ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఆస్తి తమకు ఇవ్వలేదన్నారు.
సరస్వతి పవర్ కంపెనీలో తనకు వాటా రావడంతో జగన్ తన తల్లి పేరు మీద డిఫ్ట్ డీడ్ చేశారన్నారు షర్మిల. షేర్లను గిఫ్ట్ ఇచ్చిన తర్వాత చివరకు తల్లిమీద కేసు వేసి, ఆయా షేర్లు మళ్లీ వెనక్కి ఇవ్వాలని కోరుతున్నారని దుయ్యబట్టారు. తల్లికి జగన్ చేస్తున్న మోసంగా ఆమె వర్ణించారు.
అన్యాయం చేయడానికి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి లాంటి వారితో ఎలాంటి అబద్దాలు చెప్పిస్తారని అన్నారు.జగన్‌కు క్రెడిబులిటీ ఉందో లేదో నేతలు ఆలోచన చేయాలన్నారు. శుక్రవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి పాలనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: పట్టాల పంపిణీలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ నేతలు, ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఆరోపించారు షర్మిల. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా తేలేదన్నారు. ఇప్పుడు బీజేపీ మద్దతుతో పోలవరం కడతానని చెబుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు చాలా ముఖ్యమని అన్నారు.
ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్లలో కట్టాలన్నది అసలు ఉద్దేశమన్నారు. ప్రజా ప్రతినిధులకు ఎవరి రాష్ట్ర ప్రయార్టీలు వారికి ఉంటాయన్నారు. మన రాష్ట్ర ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు షర్మిల. పోలవరం వీరి సమస్య కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలో భాగమైన వారిలో జగన్, చంద్రబాబు కూడా ఉన్నారన్నారు.
బడ్జెట్‌లో దీని గురించి ప్రస్తావించినప్పుడు ఎంపీలు ఎందుకు నిలదీయలేదని అన్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఎందుకు కరెక్టు చేయలేదన్నారు. 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్నది వైఎస్ఆర్ ప్లాన్ అని చెప్పిన షర్మిల, ఇప్పుడు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు విషయంలో అందరూ చాలా తెలివిగా తప్పించుకుంటున్నారని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్. ప్రాజెక్టు ఎత్తు కుదించలేదని లోకేష్ చెబుతున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టు కెపాసిటీ ఎంత అన్నది అసలు ప్రశ్న అని సూటిగా ప్రశ్నించారు. 45 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నామని రేపైనా దీనిపై సీఎం చంద్రబాబు క్లారిఫికేషన్ ఇవ్వాలన్నారు.
ఈ ప్రాజెక్టు 55 వేల కోట్లతో నిర్మిస్తున్నామని గతంలో చెప్పారని, ఇప్పుడు సడన్‌గా 30 వేల కోట్లకు ఎలా చేరిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న మోసంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ అందరూ భాగస్వామ్యులయ్యారని అన్నారు. ప్రత్యేకహోదా మాదిరిగా ఈ ముగ్గురూ ప్రాజెక్టును ఖూనీ చేశారని వివరించారు.
సీఎం చంద్రబాబు, బీజేపీ నేతలు ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారు : YS షర్మిలా రెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అని చంద్రబాబు చెప్పారు
కానీ ఆంధ్రకు ప్రత్యేక హోదా తేలేకపోయారు
ఇప్పుడు కూడా బీజేపీ మద్దతుతో పోలవరం కడతానని చంద్రబాబు అంటున్నారు
చంద్రబాబు,… pic.twitter.com/mAsWN6haGF
— BIG TV Breaking News (@bigtvtelugu) April 4, 2025