BigTV English

Tiktoker Shot Dead: టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ హత్య.. వీడియో లైవ్ స్ట్రీమింగ్‌లో యువతిపై కాల్పులు..

Tiktoker Shot Dead: టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ హత్య.. వీడియో లైవ్ స్ట్రీమింగ్‌లో యువతిపై కాల్పులు..

Tiktoker Livestreaming Shot Dead | ఒక అందమైన యువతి టిక్ టాక్ లో లైవ్ వీడియో స్ట్రీమింగ్ చేస్తుండగా.. అక్కడికి అనూహ్యంగా వచ్చిన ఒక యువకుడు ఆమెపై కాల్పుడు జరిపాడు. వీడియోలో ఆ యువకుడు చేస్తున్న కాల్పులు చూసి ఆ టిక్ టాకర్ యువతి అభిమానులు షాక్ కు గురయ్యారు. కలకలం రేపిన ఈ ఘటన మెక్సికో దేశంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మెక్సికో దేశానికి చెందిన 23 ఏళ్ల వెలేరియా మార్కెజ్ బ్యూటీ, మేకప్ టిప్స్ గురించి వీడియోలు చేస్తూ టిక్ టాక్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా బాగా ఫేమస్ అయింది.ఆమె మెక్సికో దేశంలోని జాలిస్కో రాష్ట్రం జాపోపాన్ నగరంలో నివసిస్తోంది. అక్కడ ఒక బ్యూటీ సలోన్ లో ఉద్యోగం చేస్తూ మహిళలు, యువతులకు మేకప్ చేస్తూ.. అందులో ప్రావీణ్యం సంపాదించింది. ఆ తరువాత తన స్కిల్స్ ని సోషల్ మీడియా ద్వారా వీడియోలలో షేర్ చేసేది. దీంతో ఆమె వీడియోలకు విపరీతంగా ఆదరణ లభించింది. కేవలం నెలల వ్యవధిలోనే ఆమె బాగా ఫేమస్ అయిపోయింది.

మరోవైపు మెక్సిలో గత కొంతకాలంగా ఫెమిసైడ్ (మహిళలపై హింస, హత్య) కేసుల సంఖ్య బాగా పెరిగిపోయింది. మహిళలను లేదా అమ్మాయిలను వారి జెండర్ కారణంగా పరువు హత్యలు లేదా పురుషాహంకారంతో చేసే హత్యలను ఫెమిసైడ్ అని అంటారు. ఇండియాలో ఒకప్పుడు ఉన్న సతీ సహగమనం కూడా ఫెమిసైడ్ క్యాటగిరీలోనే నిర్వచించారు. ఈ ఫెమిసైడ్ హత్యల కేసుల్లో 50 శాతం ఎక్కువగా యువతుల ప్రేమికులు, భర్త లేదా కుటుంబ సభ్యులే చేస్తారని గణాంకాలు చెబుతున్నాయి. గృహ హింస, బలవంతపు అబార్షన్లను ఫెమిసైడ్ లోనే ఓభాగం.


తాజాగా మెక్సికోలో వెలేరియా కూడా ఫెమిసైడ్ హత్యకు గురైందని జాలిస్కో పోలీసులు మంగళవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు. ఆమె అభిమాని లేదా ఆమె ప్రియుడే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం వెలెరియా తాను పనిచేసు బ్యూటీ సలోన్ లో ఒక బొమ్మకు జుట్టు కట్ చేస్తూ వీడియో చేస్తుండగా.. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆమెను పలకరించాడు. ‘హే వేల్’ అని పిలవగానే అది విని ఆమె వీడియోని మ్యూట్ చేసి వెనక్కు తిరిగి ‘యెస్ చెప్పండి’ అని రిప్లై ఇచ్చింది. అంతే ఆ తరువాత ఆ యువకుడు వరుసగా ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు.ఆ తరువాత ఆ యువకుడు ఆమె ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాల్పులు జరిపిన ఆ యువకుడి ముఖం కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే వీడియోలో కనిపించిందని పోలీసులు తెలిపారు.

Also Read: డ్రగ్స్ కోసం ఏకంగా రూ.కోటి విలువ చేసే ఇంటినే అమ్మేసిన హైదరాబాద్ డాక్టర్, విస్తుపోయే నిజాలు!

ఇన్‌స్టాగ్రామ్, టిమ్ టాక్ ప్లాట్ ఫామ్స్ లో వెలెరీయా మార్కెజ్ కు 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతకుముందు చేసిన ఒక వీడియోలో వెలేరియా మాట్లాడుతూ.. తన కోసం ఎవరో ఒక అభిమాని వచ్చారని.. ఏదో ఖరీదైన కానుక తీసుకొచ్చారని తెలిపింది. అయితే ఆ అభిమాని వచ్చినప్పుడు తాను సలోన్ లో లేకపోవడం వల్ల అతడిని కలుసుకోలేకపోయానని చెప్పింది. అయితే ఇలా తనను కలుసుకోవడానికి అభిమానులు రావడం తనకు ఇష్టం లేదని కూడా తెలిపింది.

లాటిన్ అమెరికా దేశాల్లో మెక్సితో పాటు పరాగ్వే, ఉరుగ్వే, బొలివీయా దేశాల్లో మహిళలపై హింస కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికా అండ్ కరెబియన్ నివేదిక తెలిపింది.

Related News

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Big Stories

×