OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి ప్లాట్ ఫామ్ వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో పెళ్లి కాకుండానే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జీ 5 (ZEE5) లో
ఈ రొమాంటిక్ ఫాంటసీ తమిళ్ మూవీ పేరు ‘ఒరు పక్క కథై’ (Oru pakka Kathai). 2020 లో రిలీజ్ అయిన ఈ మూవీకి బాలాజీ తరణీతరన్ దర్శకత్వం వహించారు. ఇందులో కాళిదాస్ జయరామ్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనిని కె.ఎస్. వాసన్స్ విజువల్ వెంచర్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ నిర్మించార. ఈ మూవీ 25 డిసెంబర్ 2020 నుండి జీ 5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
శరవన్, మీరా ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటారు. తొందరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. మీరాకి ఒంట్లో బాగోలేక హాస్పిటల్ కి వెళుతుంది. అయితే అక్కడ ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలిసి మీరా తల్లిదండ్రులు చాలా బాధపడతారు. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ ఎలా అయ్యిందని దిగులు పడతారు. మీరా బాయ్ ఫ్రెండ్ శరవన్ ను పిలిపించి మాట్లాడతారు. అయితే మేము అలా కలవలేదని, అది ఎలా వచ్చిందో తమకు తెలియదని చెప్తారు. ఒక పెద్ద డాక్టర్ వద్దకు వెళ్లి మరోసారి చెక్ చేసుకుంటారు. డాక్టర్ టెస్టులు చేసి మరోసారి రమ్మని చెప్తాడు. రిపోర్ట్స్ వచ్చాక రెండు ఫ్యామిలీలను రమ్మని చెప్తాడు. ఇది సైన్స్ లో అరుదైన సంఘటన అని డాక్టర్ చెప్తాడు. మగవాడి ప్రమేయం లేకుండానే, అరుదుగా ఇటువంటి ఘటనలు జరుగుతుంటాయని తెలియజేస్తాడు. అప్పుడు రెండు కుటుంబాలు సంతోషంతో వీళ్ళ పెళ్లి కూడా జరుపుతారు. మీడియాకు కూడా ఈ విషయం తెలియడంతో మ్యాటర్ వైరల్ అవుతుంది.
అప్పుడు ప్రజల రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మీరాకు కూతురు పుడుతుంది. సాక్షాత్తు దేవి అవతారం అని కొందరు అనుకుంటే, ఆమె జాతకం చాలా గొప్పదని మరి కొంతమంది అంటారు. మూడు సంవత్సరాల వయసు వచ్చాక ఒక స్వామీజీ ఆ అమ్మాయిని తమ ఆశ్రమంలో వదలాలని చెప్తాడు. ఆమె దేవుడి బిడ్డ కాబట్టి ఆశ్రమంలోనే ఉండాలని ఆదేశిస్తాడు. ఆ అమ్మాయిని తన దగ్గరే ఉంచుకొని, ఫ్యామిలీని బయటకు పంపిస్తాడు. అప్పుడు మీరా, శరవన్ కోర్టుకు వెళ్తారు. కోర్టులో కూడా ఆ చిన్న పిల్ల తమకు సొంతమని చాలా మంది పిటిషన్లు వేస్తారు. చివరికి ఆ చిన్న పాప ఏమవుతుంది? కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది? నిజంగానే ఆమెకు మహిమలు ఉన్నాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, జీ 5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఒరు పక్క కథై’ (Oru pakka Kathai) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.