BigTV English

Tamannaah: మిల్కీ బ్యూటీ దానికే పరిమితం కానుందా.. ఇలా అయితే కష్టం సుమా..!

Tamannaah: మిల్కీ బ్యూటీ దానికే పరిమితం కానుందా.. ఇలా అయితే కష్టం సుమా..!

Tamannaah:ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా (Tamannaah) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో లేలేత అందాలతో మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ‘శ్రీ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఆ తర్వాత ‘హ్యాపీ డేస్’ చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాలేజ్ డేస్ ను గుర్తు చేస్తూ.. బీటెక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ఇక ఈ సినిమా అందించిన విజయంతో పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు లభించాయి. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది తమన్నా


స్పెషల్ సాంగ్ లకే పరిమితం కానుందా..

అలా టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూనే.. మరొకవైపు కోలీవుడ్ లో కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో అటు బాలీవుడ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తోంది కానీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పైగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అలా సంపత్ నంది స్టోరీ , స్క్రీన్ ప్లే అందించగా అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఓదెలా 2 సినిమాతో ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మినహా ఈమె చేతిలో మరొక సినిమా లేదని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే తమన్నా బాలీవుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నటువంటి పాట లుక్ లీక్ అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.


ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులు..

ఇక దీన్ని చూసిన తర్వాత.. తమన్నా సినిమాలలో లీడ్ రోల్ కంటే స్పెషల్ సాంగ్ లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఆఖరికి బాలీవుడ్ ను కూడా వదిలిపెట్టకుండా హీరోయిన్ క్యారెక్టర్ కి కాకుండా స్పెషల్ సాంగ్స్ కే పరిమితం అవుతోంది. ఇటీవల రజనీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు అజయ్ దేవగన్)Ajay Devgan) హీరోగా నటిస్తున్న ‘రైడ్ 2’ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఇప్పటికే ఈమె లుక్కుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఈమె అందం చూసి నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు..ఇక ఇలా అందానికి తగ్గ అందం.. అంతకుమించి నటన.. అన్నీ. ఉన్నా కూడా ఈమెకు హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంపై అభిమానులు నిట్టూరుస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి దూరం అవ్వలేక.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతోంది. ఒకవేళ ఇదే కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో ఈమెకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందేమో అని అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు వైవాహిక బంధం లోనైనా సెటిల్ అవుతుంది అనుకుంటే.. అక్కడ కూడా విజయ్ వర్మ (Vijay Varma) తో బ్రేకప్ చెప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇటు సినీ కెరియర్ లోను అటు వ్యక్తిగతంగా కూడా వెనుకబడిపోతుంది తమన్న. మరి ఇప్పటికైనా కాస్త ఆలోచించి హీరోయిన్ పాత్రలకి ఓటు వేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. మరొకవైపు తమన్నతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయనతార, త్రిష మాత్రం వరుస పెట్టి సినిమాలలో హీరోయిన్లుగా నటిస్తుంటే.. ఇలా తమన్నా మాత్రం స్పెషల్ సాంగ్ లకే పరిమితం అవడం అభిమానులను పూర్తిగా హర్ట్ చేస్తోందని చెప్పవచ్చు. మరి ఇకనైనా తమన్నా తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×