Ram Charan: స్టార్ హీరోలు కేవలం సినిమాల్లోనే బిజీ అవ్వకుండా అప్పుడప్పుడు బుల్లితెరపై, యాడ్స్‌లో కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా యాడ్స్‌లో కనిపిస్తూ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేయడం స్టార్ హీరోలకు అలవాటే. అలాంటి ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేయడంతో పాటు వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేస్తుంటారు. అలా ఎన్‌టీఆర్, మహేశ్ బాబు, రానా లాంటి హీరోలు సైతం పలు ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తూ బిజీ అయిపోయారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రామ్ చరణ్ కూడా యాడ్ అయ్యారు. ఒక కూల్ డ్రింక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్‌ను కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా దానికి సంబంధించిన యాడ్‌ను కూడా విడుదల చేశారు.
యాడ్ నచ్చేసింది
రామ్ చరణ్ ఒక షూటింగ్‌లో పాల్గొనడంతో ఈ యాడ్ మొదలవుతుంది. స్టంట్ మాస్టర్ తప్పు వల్ల తన చేతికి గాయమవుతుంది. అయినా కూడా తాను మొండోడినే అంటూ ఒంటి చేతితో ప్రాక్టీస్ మొదలుపెడతాడు రామ్ చరణ్. అలా తనలో ఎంత స్టామినా ఉందో చూపిస్తూ ఈ యాడ్‌ను తెరకెక్కించారు. మొత్తానికి సినిమాలో ఎంత మాస్ లుక్‌లో ఉంటాడో.. ఈ యాడ్‌లో కూడా అదే లుక్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను అలరించాడు ఈ మెగా హీరో. మామూలుగా స్టార్ హీరోలు సినిమాలు చేసే విషయంలో ఆలస్యం అయినా.. అప్పుడప్పుడు ఇలాంటి యాడ్స్‌లో వారిని చూసుకుంటూ ఫ్యాన్స్ మురిసిపోతారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు కూడా ఈ యాడ్ తెగ నచ్చేసింది.
యావరేజ్ హిట్
రామ్ చరణ్ (Ram Charan) సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తను బుచ్చి బాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. తను చివరిగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో కలిసి చేసిన సినిమా కూడా రామ్ చరణ్‌కు హిట్ అందించలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. అసలైతే శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై వారు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలకు తగినట్టుగా సినిమా లేకపోవడంతో కేవలం యావరేజ్ హిట్‌గా నిలిచింది. అందుకే రామ్ చరణ్ మాత్రమే కాదు.. తన ఫ్యాన్స్ ఆశలు కూడా ఇప్పుడు ‘పెద్ది’పైనే ఉన్నాయి.
Also Read: నయనతార వల్లే విడిపోలేదు.. నిజాలు బయటపెట్టిన ప్రభుదేవా భార్య..
మొదట్లో సందేహాలు
దర్శకుడిగా బుచ్చిబాబుకు కేవలం ఒక సినిమా అనుభవం మాత్రమే ఉంది. అయినా కూడా తనను, తన టాలెంట్‌ను నమ్మి డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చాడు రామ్ చరణ్. వీరి కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకుల్లో ముందు నుండే సందేహాలు ఉన్నాయి. అసలు రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్‌ను బుచ్చిబాబు హ్యాండిల్ చేయగలడా అనే అనుమానాలు కూడా వినిపించాయి. కానీ తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయిన ‘పెద్ది’ గ్లింప్స్ ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చింది. ఇందులో మరీ మాస్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ హీరో. పైగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రామ్ చరణ్ ఇప్పటివరకు సినిమా చేయలేదని, ఇది తనకు కొత్త ప్రయోగం అని ఫీలవుతున్నారు.
Campa ropes in Ram Charan as Brand Ambassador – Announces new marketing campaign embodying determination, resilience, and personal grit pic.twitter.com/VcFPRb72Nz
— Reliance Industries Limited (@RIL_Updates) April 11, 2025