Tamannaah..కుర్రాళ్ళ క్రష్ గా మారిపోయిన మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah).. ప్రస్తుతం వరుస పెట్టి స్పెషల్ సాంగ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తాయనుకుంటే.. ఈ అమ్మడికి మాత్రం ఎక్కువగా అదే స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఆఫర్లు లభిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేస్తోంది తమన్నా. అందులో భాగంగానే ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ.. ఆ 5 నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం కూడా భారీగా డిమాండ్ చేస్తూ.. సినిమాలలో హీరోయిన్ గా నటించలేదనే ఆలోచనలను కూడా ఇలా తీర్చుకుంటోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
5 నిమిషాల కోసం అన్ని కోట్లా..
ఇకపోతే ఈమధ్య కాలంలో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ వీటికే పరిమితమవుతున్న తమన్నా.. ఒక్కో పాట కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలిస్తే మాత్రం గుండె గుబేల్ అనాల్సిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఒక్కో స్పెషల్ సాంగ్ కోసం సుమారుగా రూ.5కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట మిల్కీ బ్యూటీ తమన్న. ఇక దీని బట్టి చూస్తే తమన్న డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం విన్న నెటిజన్స్ కూడా హీరోయిన్ గా చేసిన ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ రాదేమో.. ఐదు నిమిషాల కోసం ఈ రేంజ్ డిమాండ్ అంటే మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమెను సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమన్నా సినిమాలు..
తమన్నా ప్రస్తుతం అశోక్ తేజ (Ashok Teja) దర్శకత్వంలో సంపత్ నంది (Sampath Nandi) పర్యవేక్షణలో రాబోతున్న ‘ఓదెల 2’ సినిమాలో నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో తమన్నా తొలిసారి నాగ సాధ్వి గా కనిపించబోతోంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో ప్రేతాత్మ.. ఊరిని వల్లకాడుగా మారుస్తున్న సమయంలో రంగంలోకి దిగిన శివశక్తి ఎలా ఆ ప్రేత్నాత్మ నుండి ఊరిని కాపాడింది అనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. ట్రైలర్ కూడా ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక మరొకవైపు హిందీలో అజయ్ దేవగన్ (Ajay Devgan) హీరోగా నటిస్తున్న ‘రైడ్ 2’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోంది తమన్నా. అంతేకాదు ఈమె లుక్ కు సంబంధించిన వీడియో కూడా ఇటీవల వైరల్ అవ్వగా.. సోషల్ మీడియాలో ఈమె అందాలు చూసి యువత ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అంతేకాదు ఈమె ఐటమ్ సాంగ్ కోసమే.. సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం . అజయ్ దేవగన్ హీరోగా, రితేష్ దేశ్ముఖ్ , వాణి కపూర్ కీలక పాత్రల్లో రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే ఒకటవ తేదీన విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో తమన్నా ఇంకెలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.